ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదల అవ్వకుండానే సీజన్ 3 స్టార్ట్..!

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే.మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

 Amazon Prime Do The The Family Man Season 3, The Family Man Season 3, The Family-TeluguStop.com

ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో అమెజాన్ దీనికి సీక్వెల్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 తెరకెక్కించారు.త్వరలోనే విడుదల అవ్వబోతున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది.అమెజాన్ ప్రైమ్ లో ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ జూన్ 4న స్ట్రీమింగ్ అవ్వబోతుంది.

ఈ వెబ్ సిరీస్ ఇండియాలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది.అందుకే దీనికి సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది.

Telugu Amazonprime, Amozon Prime, Samantha, Season, Web-Movie

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో హిట్ అయ్యింది.ఇప్పుడు దీని సెక్వెల్ కోసం బాలీవుడ్ అభిమానులతో పాటు సౌత్ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా కీలక పాత్రలో నటించింది.

అంతేకాదు సమంత ఈ వెబ్ సిరీస్ లో పాకిస్తానీ ఉగ్రవాదిగా కనిపించ బోతుందని తెలుస్తుంది.

నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సమంత నటించడం వల్ల ఈ వెబ్ సిరీస్ విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 విడుదల కు సిద్ధంగా ఉండగానే అప్పుడే సీజన్ 3 గురించి చర్చలు కూడా జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.రాజ్ అండ్ డీకే సీజన్ 3 కోసం అప్పుడే స్టోరీ లైన్ కూడా అనుకున్నారట.

ఈ స్టోరీ లైన్ అమెజాన్ కూడా నచ్చడంతో ఇంకా ఆ స్టోరీ లైన్ ను డెవలప్ చేసేందుకు సిద్ధం అయినట్టు టాక్ నడుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube