అమెజాన్ ప్రైమ్ కి దొరికిన మహర్షి! దిల్ రాజుకి భాగా గిట్టుబాటు అయ్యిందే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మహర్షి.ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా, అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

 Amazon Prime 11 Crores Invest On Maharshi Movie Digital Rights-TeluguStop.com

ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాని మహేష్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది.

దిల్ రాజు అంచనా ప్రకారం ఈ సినిమాకి 130 కోట్లకి పైగానే అయినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా ఈ సినిమా బిజినెస్ ఆశించిన అవ్వలేదని, టేబుల్ లాస్ తో సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైం భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు మహేష్ కెరియర్ లో ఏ సినిమాకి పెట్టని స్థాయిలో ఈ సినిమా కోసం అమెజాన్ సంస్థ పెట్టుబడి పెట్టిందని.ఏకంగా 11 కోట్లు డిజిటల్ రైట్స్ కోసం ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.ఇక డిజిటల్ రైట్స్ రూపంలో రిలీజ్ కి ముందే ఈ స్థాయిలో ప్రాఫిట్ రావడం నిజంగా విశేషం.

మరి ఊపిరి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని దర్శకుడు వంశీ పైడిపల్లి చేస్తున్న ఈ సినిమా మహేష్ కి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube