అరే.. కేక్ లను ఇలా కూడా చేపిస్తున్నారా..?!

ఇంటర్నెట్ పుణ్యమా అని రోజుకో కొత్త వస్తువు మన కళ్లకు కనిపించి మనల్ని ఆకట్టుకుంటోంది.ఈ ఇంటర్నెట్ యుగంలో అందరికీ నచ్చేలా ఉండాలంటే మరింత స్పెషల్ గా ఉండాల్సిందే.

 Amazon Parcel Package Cakes Photos Viral-TeluguStop.com

అందుకేనేమో.తాజాగా విభిన్నమైన కేకులకు కూడా క్రేజ్ పెరిగిపోతుంది.

అయితే మనం పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, న్యూ ఇయర్‌ వేడుకలు ఇలా శుభకార్యం ఏదైనా కేక్‌ ఉండాల్సిందే మరి.

 Amazon Parcel Package Cakes Photos Viral-అరే.. కేక్ లను ఇలా కూడా చేపిస్తున్నారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కేక్‌ కటింగ్‌​ చేస్తేనే స్పెషల్‌ డేగా ఫీల్‌ అవుతాం.మరి కేక్‌ కు ఇంతలా డిమాండ్‌ పెరుగుతండటంతో తయారీదారులు(బేకర్స్‌) కూడా విభిన్న రూపాల్లో డిజైన్‌ చేస్తున్నారు.మనకు నచ్చే విధంగా కొత్త కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు.

ఇటీవలే హాస్పిటల్‌ బెడ్‌ పై నవ్వుతున్న ఓ పేషెంట్‌ లా తయారు చేసిన కేకు ఒకటి ట్రెండ్‌‌ అయిన విషయం తెలిసిందే.తాజాగా ఈ కోవకే చెందిన ఓ వినూత్న కేక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇది సాధారణమైన కేక్‌ కాదండోయ్‌.అమెజాన్‌ పార్సిల్‌ రూపంలో ఉన్న కేక్.

అవును మీరు విన్నది నిజమే.అచ్చం అమెజాన్‌ నుంచి వచ్చే ప్యాకేజ్‌ ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ కేక్‌ ను డిజైన్‌ చేశారు.అయితే దీనిని ఓ కేకు తయారీ సంస్థ డిజైన్‌ చేసింది.యాజమాని కొడుకు పుట్టినరోజు కోసం ఈ కేక్‌ తయారు చేశారు.ఇక దీనిని ట్వీటర్‌ లో పోస్టు చేయడంతో అమెజాన్‌ పార్సిల్‌ కేక్‌ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.దీన్నిచూసిన నెటిజన్లు నిజంగానే అమెజాన్‌ పార్సిల్‌ అనుకుంటున్నారు.

కానీ, అది కేక్‌ అని చెప్పడంతో సందేహించి మరింత పరీక్షించి చూస్తున్నారు.ఈ తర్వాత కేక్‌ అని క్లారిటీ రావడంతో సర్ప్రైజ్‌ అవుతున్నారు.

అంతేగాక అనేకమంది నెటిజన్లు ఈ కేక్‌ పై మీమ్స్‌ సృష్టిస్తున్నారు.మరి ఇతంలా వైరలవుతున్న దాని‌పై మీరు కూడా ఓ లుక్కేయండి ఈ ట్వీట్‌కు వేలల్లో లైక్‌ లు వస్తున్నాయి.

ఈ ప్యాకేజీ కేకును తయారు చేసిన వ్యక్తి పనితీరును మెచ్చుకుంటున్నారు.దీనికి చాలామంది ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటి నుంచి అమెజాన్ పార్సిల్‌ ను బాగా నలిపిన తరువాతే డెలివరీ బాయ్ నుంచి తీసుకోవాలని ఒక వ్యక్తి కామెంట్ రాశారు.

#Social Media #Amazon Parcel #Cake #CakeLook #Netizens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు