అమెరికన్స్ కి అమెజాన్ బంపర్ ఆఫర్..!!!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలపై చూపించిన విశ్వరూపం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ముఖ్యంగా అమెరికా వంటి అగ్ర రాజ్యంపై కరోనా విరుచుకు పడిందనే చెప్పాలి.

 Amazon Announces Plans To Create New Jobs In Us, Americans, New Jobs, Amazon, Co-TeluguStop.com

లక్షలాది మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది క్షతగాత్రులుగా ఇప్పటికి ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటున్నారు.లాక్ డౌన్ కారణంగా ఎన్నో వ్యాపారాలు, ఐటీ సంస్థలు, మూసివేయబడ్డాయి.

కోట్లాది మంది నిరుద్యోగులుగా మారిపోయారు.ఈ పరిస్థితుల నుంచీ అమెరికా ప్రజలని బయటపడేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది.

ఈ క్రమంలోనే

అమెరికాలోని అమెరికన్స్ కి అమెజాన్ గుడ్ న్యూస్ తెలిపింది.కరోన కారణంగా కరువు కోరల్లో చిక్కుకుని పోయిన ఎంతో మందికి ఉపాది కల్పించడానికి సిద్దమయ్యింది అమెజాన్.

అమెరికాలోని వాషింగ్టన్ లోని బెల్లీవ్ లో దాదాపు 43 అంతస్తుల నిర్మాణాన్ని చెప్పట్టింది.ఇది 2019 లోనే మొదలయ్యింది.

అప్పట్లో సుమారు 15 వేల మందికి ఉపాది కల్పిస్తామని సంస్థ తెలిపింది.అయితే తాజాగా అమెజాన్ మరో రెండు మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసింది.

దాంతో ఈ ప్రాజెక్ట్ పరిమితి పెరగడంతో మరో 10 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది.దాంతో

అమెజాన్ ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక సుమారు 25వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే.ఈ ఉద్యోగాలలో సుమారు 15 వేల మందిని కొత్త వారిని తీసుకుంటారని, మరి కొంతమందిని సి టెల్ లోని సంస్థ నుంచీ బదిలీ చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.

ఇదిలా ఉంటే కోవిడ్ కారణంగా డోర్ డెలివరీ లకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో ఈ ఉద్యోగాలకి గాను సుమారు 75 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను తీసుకోనున్నట్టుగా గతంలోనే ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube