ఉద్యోగి చేసిన పనికిమాలిన పనికి ఏకంగా రూ.47 కోట్ల పరిహారం చెల్లిస్తున్న అమెజాన్!

అవును, మీరు విన్నది నిజమే.ఓ ఉద్యోగి చేసిన పనికిమాలిన పనికి అమెజాన్( Amazon ) ఏకంగా రూ.47 కోట్ల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.ఈ మధ్య కాలంలో మనిషి పూర్తిగా టెక్నాలజీమీద ఆధారపడి జీవించడం మొదలు పెట్టాడు.

 Amazon Is Paying Compensation Of Rs. 47 Crore For The Useless Work Done By The-TeluguStop.com

ఒకప్పుడు దగ్గర దూరాలకి కూడా ఎంచక్కా నడిచి వెళ్లి తమ పని తాము చేసుకొనే మనిషి నేడు ముడ్డి కదపడానికి కూడా ఇష్టపడడం లేదు.దానికి కారణం టెక్నాలజీ అని వేరే చెప్పాల్సిన పనిలేదు.

అవును, మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ఇపుడు మనిషిని బద్ధకస్తుడిగా, బానిసగా తయారు చేస్తుంది.

Telugu Amazon, Colombia, Useless, Rs Crore, Doorbell, Employee-Telugu NRI

అదే బద్ధకం, బానిసత్వాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.విషయంలోకి వెళితే, ఇటీవలకాలంలో అలెక్సా, “పాటలు ప్లే చెయ్”.“లైట్లు ఆపెయ్“.“గీజర్ ఆన్‌చెయ్” అనడం ఇటీవల పెరిగిపోతోంది.అమెజాన్ డోర్‌బెల్ కెమెరా యూనిట్ ‘రింగ్( Ring door bell ) కూడా అటువంటి ఓ గాడ్జెట్ అని చెప్పుకోవాలి.లేచివెళ్లి తలుపు తీయాల్సిన అవసరం లేకుండా వాయిస్ కమాండ్ ఇస్తే చాలు… అదే తలుపు ఓపెన్ అయ్యేలా చేస్తుందన్నమాట.

అయితే ఈ వాయిస్ అసిస్టెంట్లు రికార్డ్ చేసే డేటా దుర్వినియోగం ఇక్కడ జరిగింది.

Telugu Amazon, Colombia, Useless, Rs Crore, Doorbell, Employee-Telugu NRI

కొలంబియా డిస్ట్రిక్ట్‌లో( Colombia )ని ఫెడరల్ కోర్టులో దాఖలైన పిటిషన్‌ ప్రకారం, ‘రింగ్’ 5.8 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో సుమారు 47 కోట్ల రూపాయల పరిహారం చెల్లించేందుకు రెడీ అయింది.రింగ్ కెమెరాలు రికార్డ్ చేసిన మహిళా వినియోగదారుల బాత్రూమ్, బెడ్రూమ్‌ దృశ్యాలతో కూడిన కొన్ని వేల వీడియోలను ఓ ఉద్యోగి చూసిట్లు ఎఫ్‌టీసీకి చేసిన ఫిర్యాదులో తేలింది.ఆ వీడియోలు చూస్తున్నట్లు తన సహచర ఉద్యోగి గమనించిన తర్వాతే ఆయన వాటిని చూడడం ఆపేసినట్లు అందులో పేర్కొన్నారు.

గోప్యత, డేటా భద్రత విషయంలో రింగ్ నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయింది.ఇంకేముంది కట్ చేస్తే ‘రింగ్’ వల్ల రూ.47 కోట్లు పరిహారం కింద కట్టాల్సి వస్తోంది అమెజాన్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube