అక్టోబర్ 4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్గ్రే ట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ పేరిట నిర్వహించే ప్రతి ఏడాది నిర్వహించే మెగా డిస్కౌంట్ సేల్ తేదీలను ప్రకటించింది.అక్టోబర్ 4 నుంచి నెల రోజుల పాటు ఈ సేల్ కొనసాగుతుందని అమెజాన్ తెలిపింది.

 Amazon Great Indian Festival Sale From October 4th-TeluguStop.com

దసరా, దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకొని నెలరోజులపాటు ఈ సేల్ ను కొనసాగించనున్నట్లు కంపెనీ తెలిపింది.కాగా ప్రైమ్ మెంబర్లకు  ముందుగానే డీల్స్ ను చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా మొబైల్ ఫోన్ లు, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్లు, లాప్టాప్స్, స్మార్ట్ టీవీలు వంటి వాటిపై డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వనుంది.అమెజాన్ ఎకో, ఫైర్ స్టిక్, కిండ్లే విడైజ్ లనూ తగ్గింపు ధరలకే అందించనుంది.

 Amazon Great Indian Festival Sale From October 4th-అక్టోబర్ 4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతోపాటు యాపిల్, అసూస్, ఫాజిల్, హెచ్ పీ,  లెనోవో, వన్ ప్లస్, సామ్సంగ్, సోనీ, షావోమికి చెందిన వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులను సేల్ లో భాగంగా విడుదల చేయనున్నారు.ఈ సేల్ లో హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లు అందించనున్నారు.

క్రెడిట్, డెబిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10% ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ అందించనున్నారు.అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు కూడా క్యాష్ బ్యాక్ పాటు నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను అమెజాన్ అందించనుంది.

మరోవైపు ఇప్పటికే మరో ఈ-కామర్స్ సమస్థ ఫ్లిప్ కార్ట్ వచ్చే నెల అక్టోబర్ 7 నుంచి ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ ను నిర్వహించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

#Offers #Divali #Amazon #Dasra #Indian Festival

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు