ఓ చిన్న పార్సిల్ కు అమెజాన్ ఏకంగా..?!

చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ఏది కావాలంటే అది టక్కున మన ఇంటికి వచ్చేస్తుంది.అడుగు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి ఎంతోమంది ఆన్లైన్ షాపింగ్స్ ద్వారా వాళ్ళకి కావలిసిన వస్తువులను ఆర్డర్ చేసుకుంటున్నారు.

 Amazon For A Small Parcel-TeluguStop.com

అయితే ఆన్లైన్ లో వస్తువులను డెలివరీ చేసే సంస్థలలో అమెజాన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.నెంబర్ వన్ ఈ-కామర్స్ కంపెనీ గా అమెజాన్ పేరు గాంచింది.

కానీ కొన్ని కొన్ని సార్లు డెలివరీ సమయంలో చేసే పొరపాట్ల వల్ల కస్టమర్ల వైపు నుంచి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.తప్పు చిన్నదా.

 Amazon For A Small Parcel-ఓ చిన్న పార్సిల్ కు అమెజాన్ ఏకంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్దదా అనే విషయం ముఖ్యం కాదు అసలు తప్పు జరిగిందా లేదా అనేది ముఖ్యం కదా.ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం, నాణ్యత లేని ప్రోడక్ట్స్ డెలివరీ చేయడం వంటివి కస్టమర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి.ఇకపోతే తాజాగా మళ్ళీ అమెజాన్ సంస్థ మరొక మిస్టేక్ చేసింది.మరి అమెజాన్ చేసిన పొరపాటు ఏంటో చూడండి.అయితే ఇది జరిగింది మన దేశంలో కాదులే అండి.

వివరాల్లోకి వెళితే.

ఇంగ్లాండ్‌లోని నార్తంబర్‌ ల్యాండ్‌ లోని ఆల్న్‌విక్‌ లో నివాసం ఉంటున్న మార్క్ రీడ్ అనే ఓ వృద్ధుడు వ్యక్తి కొన్ని రోజుల క్రితం అమెజాన్‌లో ఒక ఆర్డర్ పెట్టాడు.ఆయన రూ.815 విలువైన 120 విటమిన్ డి3 టాబ్లెట్స్ ను ఆర్డర్ చేశాడు.అలాగే వాటితో పాటు రూ.768 ఖరీదు గల 12 మీట్ స్కేవర్స్‌ ను కూడా ఆర్డర్ చేశాడు.బుక్ చేసిన కొద్ది రోజులకు మార్క్ రీడ్ ఇంటికి అమెజాన్ కంపనీ నుంచి ఒక డెలివరీ బాక్స్ వచ్చింది.

ఆ డెలివరీ బాక్స్ దాదాపు చాలా పొడవు ఉంది.అది ఎంతలా అంటే ఒక పెద్ద టీవీ పట్టే అంతటి బాక్స్ అన్నమాట.అయితే ఆ బాక్స్ చూసి ఆ డెలివరీ తనకి కాదు వేరే వాళ్ళకి ఏమో అనుకున్నాడట.డెలివరీ బాయ్ తమదే అని చెప్పిన తరువాత దానిని తీసుకుని ఇంట్లోకి వెళ్లి ఆ బాక్స్ ను ఓపెన్ చేసే పనిలో పడ్డాడు.

ఆ బాక్స్ ఓపెన్ చేయగానే షాక్ అయ్యాడట.దాదాపు అందులో 10 అడుగుల పేపర్ చుట్టి ఉందట.

ఆర్డర్ చేసిన వస్తువులు పాడవకుండా ఉండడానికీ పేపర్ పెట్టడం వరకు బానే ఉన్నా గాని.లోపల పెట్టిన పేపర్ మొత్తం బయటకు తీసేసరికి మార్క్ రీడ్ చాలా కష్టపడ్డాడట.

Telugu Amazon For A Small Parcel, Amazon Order, Small Parcel, Social Meida, Viral Latest, Viral News-Latest News - Telugu

అసలు తాను ఆర్డర్ చేసిన 3 ఇంచుల విటమిన్ డబ్బా కోసం ఇంత హంగామా చేసి 20 ఇంచుల డెలివరీ డబ్బా తీసుకొచ్చారని అనుకున్నాడట.తాను ఆర్డర్ చేసిన మందుల డబ్బా చూడడానికి చాలా సమయం పట్టిందని, అలాగే నేనేదో మాయగాడిలాగా నిరంతరం బాక్స్ లో నుంచి పేపర్లు తీస్తూనే ఉన్నా.బాక్స్ అడుగుభాగంలో రెండు చిన్న ఐటమ్స్ కనిపించాయి.అయిన చిన్న ఐటమ్స్ కోసం ఇంత పెద్ద బాక్స్ వాడడం ఏంటి అని ఆయన వాపోయారు.ఆ తర్వాత డబ్బాను అయితే రీసైకిల్ చేశాను కానీ అందులోని పేపర్స్ ను ఏమి చేయాలో అర్ధం కాలేదు అని అంటున్నాడు.అమెజాన్ లాంటి గొప్ప సంస్థ వేరే కంపెనీలకు పోటీగా ఉండాలి కానీ ఇలా చేయడం సరికాదు అన్నాడు.

అయితే ఈ సంఘటనపై ఒక అమెజాన్ ప్రతినిధి స్పందించి ఇలా వివరణ ఇచ్చారు.మేము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికే ఇలాంటి ప్యాకింగ్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

#Small Parcel #AmazonFor #Social Meida #Amazon Order

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు