ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అడుగుపెట్టనున్న దిగ్గజ సంస్థ! స్విగ్గీ,జొమాటో తట్టుకుంటాయా

ఒకప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఫుడ్ డెలివరీ లదే హవా అయిపోయింది.ఒక్క పూట ఇంట్లో వంట చేయకపోయినా ఈ ఫుడ్ డెలివరీ ల పుణ్యమా అని టైం కి భోజనం చేసేస్తున్నారు జనాలు.2011 నుంచి ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ అనేది భారతదేశంలో మొదలు కాగా సక్సెస్ ఫుల్ గా రాణించాయి.ఫుడ్ డెలివరీ లలో ముందుగా చెప్పుకొనేవి స్విగ్గీ,జొమాటో,ఉబర్ ఈట్స్.

 Amazon Enterinto The Onlinefood Deliverybusiness-TeluguStop.com

అయితే ఇప్పుడు వీటికి పోటీగా మరో దిగ్గజ సంస్థ ఈ డెలివరీ బిజినెస్ లోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఆ సంస్థ ఏంటో తెలుసా.అదేనండీ మనకు కావలసిన వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే రోజుల్లో మన ఇంటికి తెచ్చిపెట్టే అతిపెద్ద సంస్థ అమెజాన్.నిజమే నిజంగా అమెజాన్ ఇక మీదట ఫుడ్ ఆర్డర్ కూడా తీసుకోబుతుందట.

ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఈ దిగ్గజ సంస్థ అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్న జొమాటో,స్విగ్గి,ఉబర్ ఈట్స్ కు గట్టి పోటీ ఇవ్వాలని భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఏడాదిలోనే అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభం కావచ్చట, ఇందుకోసం అమెజాన్ ఇండియా భారతదేశంలోని కాటమరన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది.కాటమరన్ కంపెనీని ఐటీ రంగ నిపుణులు నారాయణమూర్తి స్థాపించారు.

ఉద్యోగుల నియామకం కూడా మొదలైంది.

ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అడుగ

ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్‌లో అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.మరి ఇక ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అమెజాన్ ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి.మరి దీని ధాటికి మిగిలిన డెలివరీ సంస్థలు తట్టుకొని నిలబడతాయా అన్నది కూడా ఒక ప్రస్నార్ధకంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube