ఆ యాప్ వెంటనే డిలీట్ చెయ్యాలి.. ఉద్యోగులకు అమెజాన్ ఆదేశాలు!?

భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కారణంగా చైనాకు సంబంధించిన టిక్ టాక్ సహా 59 యాప్స్ ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ యాప్ ను తమ ఫోన్ల నుండి వెంటనే డిలీట్ చెయ్యాలని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.

సెక్యూరిటీ పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు అమెజాన్ ఈమెయిల్ పంపింది.ఇంకా ఈ నేపథ్యంలోనే అగ్ర రాజ్యం అమెరికా సైతం టిక్‌టాక్‌ను నిషేధించే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించడంతో అమెజాన్ ముందుగానే అప్రమత్తమైంది.

కాగా అమెరికా అధికారికంగా టిక్ టాక్ నిషేధిస్తూ ప్రకటన చేయకముందే ఉద్యోగుల ఫోన్‌లో టిక్‌టాక్ ఉండకూడదని అమెజాన్ ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాకు చెందిన అతి పెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్.ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇంకా టిక్ టాక్ ను ఫోన్ లో డిలీట్ చెయ్యాలని చెప్పిన అమెజాన్ ఉద్యోగులకు మరో వెసులుబాటు కనిపించింది.

ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో టిక్‌టాక్‌ను వినియోగించుకోవచ్చని అమెజాన్ ఉద్యోగులకు స్పష్టం చేసింది.

ప్రభాస్ గురించి ప్రతి సెలబ్రిటీ చెప్పే ఒకే ఒక్క మాట ఇదే !