వైరల్.. ఈ ప్రమాదం అతడికి పునర్జన్మ లాంటిదట..ఎందుకంటే?

ఎప్పుడు ఎక్కడో ఒక చోట ప్రపంచం నలుమూలల ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి.ఈ ప్రమాదాలలో ఎంతో మంది చనిపోయిన వారు ఉన్నారు.

 Amazon Delivery Driver Lucky To Be Alive After Train Van Crash, Amazon, Amazon D-TeluguStop.com

మరికొంత మంది గాయపడిన వారు కూడా ఉన్నారు.కానీ కేవలం కొంత మంది మాత్రమే ప్రమాదాల నుండి బయట పడతారు.

వారికీ నిజంగా అదృష్టం ఉండనే చెప్పాలి.ఆ అదృష్టం తోనే వారు భయంకరమైన ప్రమాదాల నుండి కూడా ప్రాణాలతో బయట పడతారు.

ఇలా కొంత మంది మనం ఆశ్చర్య పోయే విధంగా ఇలాంటి ప్రమాదాల నుండి బయట పడిన సందర్భాలు అప్పుడప్పుడు చూస్తేనే ఉంటాం.మనం ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి కూడా పెద్ద ప్రమాదానికి గురి అయ్యాడు.

కానీ అతడి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయట పడ్డాడు.అసలు అంత ప్రమాదం నుండి ఎలా బయట పడ్డాడో అతడికి కూడా అంతుపట్టడం లేదట.

Telugu Amazon, Amazondelivery, Alive, Train, Train Dash Van-Latest News - Telugu

అందరిలా కాకుండా ఇతడిని ఇది పునర్జన్మ లాంటిదట.ఎందుకంటే పుట్టిన రోజు నాడు ప్రమాదానికి గురి అయ్యి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం లేకుండానే బయట పడ్డాడు.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అమెరికాలో నివసించే ఒక వ్యక్తి అమెజాన్ డెలివెరి వ్యాన్ తో రైలు పట్టాలు దాటుతూ ఉండగా వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీ కొట్టింది.

కానీ ఇక్కడ ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏంటంటే.అతడికి ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదు.

కానీ ఈ ప్రమాదంలో అతడి వ్యాన్ మాత్రం రెండు ముక్కలు అయ్యిందట.అంత వేగంగా రైలు ఢీ కొన్న కూడా డ్రైవర్ అలాగ్జాన్డర్ ప్రాణాలతో బయట పడ్డాడు.

ఈ ఘటన ఇప్పుడు వైరల్ అయ్యింది.ఈ విషయంపై డ్రైవర్ మాట్లాడుతూ.

ట్రాక్ వద్ద స్టాప్ గేట్ లేకపోవడంతో వ్యాన్ ను ముందుకు పోనిచానని తెలిపాడు.రైలు శబ్దం వినపడంతో వేగం పెంచానని.

ఆ తర్వాత మాత్రం ఎం జరిగిందో తెలియదని.వ్యాన్ మాత్రం ముక్కలు అయిపోయిందని.

అంత ప్రమాదం నుండి బయట పడడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని.నాకు ఇది పునర్జన్మ లాంటిదని.

ఎందుకంటే ఈ రోజు నా పుట్టిన రోజు అని అతడు తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube