దేవుడా: అక్కడ బికినీ వేసుకోకపోతే ఫైన్..!

ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.ఎందుకంటే మహిళలు బికినీ వేసుకోకుండా ఆట ఆడారని సదరు మహిళలకు ఫైన్ వేశారు.

 European Hand Ball Federation Fined 1500 Euros To Norway Women Team For Not Wearing Bikini-TeluguStop.com

ఏంటి బికినీ వేసుకుని ఆడకపోతే ఫైన్ వేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? కానీ ఆది అక్కడ రూల్ అట.ఆ రూల్ ప్రకారం ఆటలో పాల్గొన్న మహిళలు బికినీ ధరించకుండా షార్ట్ వేసుకుని ఆడారని ఫైన్ వేసారట.ఇంతకీ అసలు ఆ ఆట ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యూరోపియన్ బీచ్ హ్యాండ్‌ బాల్ చాంపియన్‌షిప్ జరిగింది.

ఆ ఛాంపియన్ షిప్ లో నార్వే మహిళలు కూడా హ్యాండ్ బాల్ ఆడడం జరిగింది.కానీ వాళ్ళు రూల్స్ ప్రకారం బికినీ వేసుకోకుండా నిబంధనలను అతిక్రమించి షార్ట్స్ వేసుకోవడంతో ఫైన్ వేసారట.

 European Hand Ball Federation Fined 1500 Euros To Norway Women Team For Not Wearing Bikini-దేవుడా: అక్కడ బికినీ వేసుకోకపోతే ఫైన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ్యాచ్ లో పాల్గొన్న ప్లేయర్స్ అందరికీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ఆ జట్టు మొత్తానికి 1500 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీ లో 1,31,700 రుపాయాల జరిమానా విధించారు.అంటే జట్టు 10 మంది సభ్యులతో కూడి ఉన్నది కావున ఒక్కొక్కరు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.

Telugu Bikini, European Hand Ball Federation, Fine, Fined 1500 Euros, Norway Women Team, Not Wear, Not Wearing Bikini, Social Media, Sports, Viral Latest, Viral News-Latest News - Telugu

స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ లో నార్వే జట్టు మహిళలు బికినీల బదులు షార్ట్స్ వేసుకొని బరిలోకి వెళ్లారు.అయితే ఇలా బికినీ వేసుకుని ఆడడం ఎంత వరకు సమంజసం అని ఈ నిభంధనను వెనక్కి తీసుకోమని గత కొంత కాలంగా ఆటగాళ్లు కోరుతున్నారు.అందుకనే ఈ రూల్ కి వ్యతిరేకంగా నార్వే మహిళలు నిరసన తెలపడానికే బికినీ వేసుకోకుండా షార్ట్స్ ధరించి బరిలోకి దిగారని నార్వే హ్యాండ్‌ బాల్ ఫెడరేషన్ ప్రకటించింది.

Telugu Bikini, European Hand Ball Federation, Fine, Fined 1500 Euros, Norway Women Team, Not Wear, Not Wearing Bikini, Social Media, Sports, Viral Latest, Viral News-Latest News - Telugu

కానీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) వాళ్ళు షార్ట్ వేసుకుని ఆట ఆడినందుకు ఫైన్ వేశారని, అయితే ఇలా ఆటగాళ్లకు విధించిన ఫైన్ ఏదయితే ఉందో అది నార్వే హ్యాండ్ బాల్ ఫెడరేషన్ వాళ్లే చెల్లిస్తామని కూడా స్పష్టం చేసారు.మరి ఈ రూల్ ఎప్పటికి మారుతుందో అనేది చూడాలి.

#Not Wear #Social Media #Sports #Bikini #EuropeanHand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు