అదృష్టవంతులు: అమెజాన్ చేసిన పొరపాటుకు అతి తక్కువ ధరకే ఏసీ ని దక్కించుకున్న జనం..!

ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాగాని పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి.అది చిన్న సంస్థ అయిన పెద్ద సంస్థ అయినాగానీ మిస్టేక్స్ అనేవి కామన్.

 Amazon Customers Get Toshiba Ac At Very Less Cost Due To The Mistake Of Amazon ,-TeluguStop.com

అయితే ఒక్కోసారి తప్పు చిన్నదే అయిన ఫలితం మాత్రం పెద్దగా ఉంటుంది.చేసే తప్పు వలన కొందరు లాభపడితే మరికొందరు నష్టపడతారు.

అయితే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్ సంస్థలో జరిగింది.ఇంతకీ అమెజాన్ సంస్థ చేసిన తప్పు ఏంటి.? కస్టమర్స్ ఎలా లాభ పడ్డారు అనే కదా మీ సందేహం.మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం.

అమెజాన్ సంస్థ ఆన్లైన్ లో తక్కువ ధరకే ఏసీ అమ్మకానికి పెట్టింది.తక్కువ దర కావడంతో వినియోగదారులు కూడా ఏసీ ని కొనేసుకుని లాభపడ్డారు.అసలు విషయం ఏంటంటే అమెజాన్ లో సోమవారం తొషిబా ఎయిర్ కండిషనర్‌ కేవలం రూ.5900 ధరకే లభించింది.ఏంటి షాక్ అవుతున్నారా.? కానీ ఇది నిజంగానే జరిగింది.ధర తక్కువ కావడంతో చాలా మంది ఏసీని ఆర్డర్‌ చేసుకుని లాభపడ్డారు.తొషిబా స్ప్లిట్ ఏసీ సిస్టమ్‌ను అమ్మకానికి పెట్టేటప్పుడు అమెజాన్ సిబ్బంది చేసిన చిన్న తప్పు వలన ఇలా జరిగింది.

చేసిన పొరపాటును తెలుసుకునే లోపే చాలా మంది కస్టమర్లు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకొని ఏసీని బుక్ చేసేశారు.అసలైతే రూ.96,700 ఉన్న ఈ ఏసీని డిస్కౌంట్ గా 90,800 రూపాయలకు అందించాలి.అంటే రూ.5900 డిస్కౌంట్‌ అన్నమాట.కానీ అసలు ధర పెట్టకుండా డిస్కౌంట్ ధరనే అసలు ధరగా రూ.5900 పెట్టేసారు.దీనికి నెలకు రూ.278 రూపాయల నుంచి ఈఎంఐ కూడా అందించింది అమెజాన్.ఈ విషయం మీకు తెలిసి ఉంటే మీరు కూడా ఏసీ కొనేసేవారు కదా.

Telugu Amazon, Discount, Sell, Rs, Toshiba Ac, Latest-Latest News - Telugu

ఈ ఏసీలోని ప్రత్యేకతలు గురించి ఒకసారి తెలుసుకుందాం.దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీ హ్యుమిడిఫైయర్ లాంటివి చాలానే ఉన్నాయి.ఈ ఏసీకి పూర్తి వారంటీ సంవత్సరంతో పాటు కంప్రెసర్, పీసీబీ, సెన్సార్స్, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్ట్స్ కి మరో తొమ్మిదేళ్ల పాటు వారంటీ కూడా ఇచ్చింది.ఈ ఏసీ గ్లాస్ వైట్ కలర్ లో 105 x 25 x 32 అంగుళాల వైశాల్యంతో లభిస్తోంది.

అయితే చిన్న పొరపాటు వలన తక్కువ రేటుకే ఈ ఏసీ అమ్ముడుపోయింది.అయితే లోపం జరిగిన తర్వాత గుర్తించిన అమెజాన్‌ సిబ్బంది వెంటనే సరి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube