అమెజాన్ లో ఉద్యోగాలు చేయండి అంటున్న జెఫ్

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ వ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటల్స్ పూర్తిగా మూతపడ్డాయి.వీటి కారణంగా కొన్ని వేల నుంచి లక్షల ముంది ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డారు.

 Amazon Ceo Open Offier To Unemployees-TeluguStop.com

ఇక ఎప్పటి వరకు ఈ బంద్ ఉంటుంది అనేది తెలియని విషయం.అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రత్యామ్నాయ ఉద్యోగాలు వెతుక్కోవడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి.ఇలాంటి వేళ అమెరికాలో రోడ్డున పడ్డ బార్లు, రెస్టారెంట్లు, హోటల్స్ ఉద్యోగుల కోసం అమెజాన్ కంపెనీ సిఈఓ జెఫ్ బెజోస్ సంచలన ఆఫర్ ఇచ్చాడు.

ఉద్యోగాలు పోగొట్టుకున్న వారికి అమెజాన్‌లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జెఫ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.వారు తమ ఉద్యోగాలు తిరిగి పొందేంతవరకూ అమెజాన్ అండగా నిలుస్తుందన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలకి డిమాండ్ భాగా పెరిగింది.దీంతో ఆయా కంపెనీలు కొత్త ఉద్యోగులని నియమించుకుంటున్నాయి.

ఈ నేపధ్యంలొ అమెజాన్ సిఈఓ ఇచ్చిన ఈ ప్రకటన చాలా మంది నిరుద్యోగులకి ఊరట అందించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే ఈ కామర్స్ సంస్థల సేవలకు ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా మరో 1.5 లక్షల తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామంటూ రిటైల్ స్టోర్ల సంస్థ వాల్‌మార్ట్ కూడా అధికారికంగా ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube