అమెజాన్ బంపర్ ఆఫర్ అంట...ఆ చెప్పులు రూ.72వేలు.! దానిపై వచ్చిన ఈ కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు.!  

Amazon Bumper Offer On Slippers-

మనం బయటకి వెళ్ళాలి అంటే చెప్పులు తప్పనిసరి.చెప్పులకి మహా అంటే ఒక రెండు నుండి మూడు వేల వరకు ఖర్చు పెడతారు.మనలాంటి మధ్యతరగతి వాళ్ళం అయితే వందల్లో ఉండే చెప్పుల్ని వెతుక్కుంటాం.అందులోను ఆఫర్ లో వచ్చింది అసలే వదలము.దసరా దీపావళి సందర్బంగా అమెజాన్ లో చెప్పులపై బంపర్ ఆఫర్ అని పెట్టారు.

Amazon Bumper Offer On Slippers--Amazon Bumper Offer On Slippers-

ఏదో తక్కువలో వస్తాయి అని చూసుకుంటే మోసపోయినట్టే.‘వెలెంటినో’ కంపెనీ హవాయి చెప్పుల ధర ఏకంగా రూ.72,225.33.చెప్పులకి 72 వేల రూపాయలు ఎవరైనా ఖర్చు చేస్తారా అని ఇది చూసాక డౌట్ వచ్చింది.

ఇంతా చేస్తే ఇవి ఇంట్లో వాడే బాత్రూం చెప్పులు మాత్రమే.విచిత్రం ఏమిటంటే నిన్నమొన్నటి వరకు వీటి ధర రూ.45,393 మాత్రమే.బహుశా డిమాండ్ పెరిగిందేమో.ఇప్పుడు ఏకంగా ఏకంగా రూ.27 వేలు పెరిగింది.అది కూడా ఇప్పుడు ఒకే ఒక్క జత అందుబాటులో ఉంది.అయితే ఈ చెప్పులు ఎవ్వరు కొనలేదు అనుకుంటే కూడా మనం పప్పులో కాలేసినట్టే…

చెప్పులు కొనేముందు మీరు కూడా ఒకసారి ఈ రివ్యూలు చదవండి ‘‘మా ఆంటీ రికమెండ్ చేయడంతో ఈ చెప్పులు కొన్నా.ఇష్టంగా కొనుక్కున్న బైక్‌ను అమ్మేసి ఈ చెప్పులు కొనుక్కున్నందుకు నాకేం బాధగా లేదు.

ఈ థర్డ్ క్లాస్ చెప్పులు అద్భుతంగా ఉన్నాయి.వీటితోనే నా గమ్యస్థానానికి చేరుకుంటున్నాను.బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది.మధుమేహం నార్మల్ అయింది.దయచేసి ఈ చెప్పులు కొనుక్కోండి.ఆరోగ్యంగా ఉండండి.అవసరమైతే నా చెప్పులను రోజుకు రూ.500కు అద్దెకు ఇస్తా’’ అని ఒకరు వ్యంగ్యంగా రివ్యూ రాస్తే.

ఇక మరికొంతమంది ఎలాంటి కౌంటర్ లు వేసారో చూడండి….‘‘ఈ చెప్పులు కొనేందుకు నా మారుతి 800 కారు అమ్మేశా.ఎందుకంటే డ్రైవింగ్ చేయడం కంటే నడవడమే మంచిది.ఆరోగ్యం కూడా.డబ్బుకు తగ్గ ఉత్పత్తి’’ అని ఇంకొకరు రివ్యూలో పేర్కొన్నారు.‘‘చాలా బాగున్నాయి.చాలా అరుదైనవి కూడా.అందుకే బయటకు వేసుకెళ్లడం లేదు.వాటిని తొడుక్కుని నిద్రపోతున్నా.ఆ తర్వాత లాకర్‌లో పెట్టేస్తున్నా’’ అని మరొకరు రాశారు.‘‘మంచి ప్రొడక్ట్.చాలా చక్కగా ఉన్నాయి.అందుకనే నా కిడ్నీ అమ్మేసి వీటిని కొనుక్కున్నా’’ అని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.

మొత్తానికి.బాత్రూమ్ చెప్పులు ఇంత ధరా అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.