టిక్ టాక్ తరహా యాప్‌ తీసుకురానున్న అమెజాన్ యాప్

ప్రస్తుతం సోషల్ మీడియా యాప్‌లకు ఎనలేని డిమాండ్ ఉంది.ముఖ్యంగా చాలా మంది యువత తమ వీడియోలు, మెసేజ్‌లు పోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

 Amazon App To Bring Tik Tok Like App, Tik Tok, New Application, Launching, Amaz-TeluguStop.com

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో షార్ట్స్ వీడియోను యూజర్లను అలరిస్తుంటాయి.చాలా మంది వాటిని ఉపయోగిస్తూ, గంటల తరబడి మైమరిచి పోతూ ఉంటారు.

వీటి వల్ల ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను ఎక్కువగా వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది.ఇక రీల్స్, షార్ట్స్ చేసే వారికి ఆదాయం కూడా వస్తుంటుంది.

ఇక యువత నుంచి పెద్ద వారి వరకు తమ ప్రతిభను చాటడానికి వీటిని వేదికలు చేసుకుంటున్నారు.ఇక వ్యాపార దిగ్గజం అమెజాన్ కూడా ఇదే తరహాలో సరికొత్త యాప్‌ను త్వరలో తీసుకురానుంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

“ఇన్‌స్పైర్” అనే అంతర్గత పేరుతో పరీక్షించబడుతున్న పోర్టల్‌లో యాప్‌ను అమెజాన్ అభివృద్ధి చేస్తోంది.అమెజాన్ యాప్ గురించి హోమ్ పేజీలో కూడా ఉంది.ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి యువకులు, పెద్ద వారు కూడా సోషల్ మీడియా యాప్‌లకు అలవాటు పడుతున్నారు.

దానిలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేసి ఆనంద పడుతున్నారు.ఇక ఆయా ఫొటోలు, వీడియోలకు షేర్లు, లైకులు, కామెంట్లు అధికంగా వస్తే వారి సంబరాలకు హద్దు ఉండదు.

Telugu Amazon, Latest, Tik Tok-Latest News - Telugu

ఇదే కోవలో యాప్ తీసుకు రావాలని అమెజాన్ యత్నిస్తోంది.టిక్ టాక్, రీల్స్, షార్ట్స్ తరహాలో తీసుకొచ్చే ఆ యాప్ ప్రజలను అలరించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ వాచ్‌ఫుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ యాప్ గురించి ఎన్నో విషయాలను తెలియజేసింది.టిక్ టాక్, రీల్స్, షార్ట్స్ వంటి యాప్‌లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆ యాప్ ఉండనుంది.

ఈ యాప్ కోసం చాలా మంది వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube