Feet Care Tips : అందమైన పాదాల కోసం అద్భుతమైన టిప్స్

శరీరంలో మొఖంతో పాటు కాళ్లని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటారు చాలా మంది.వీటి పై చాలా దృష్టి పెడుతారు.

 Amazing Tips For Beautiful Feet, Foot Care,feet Care Tips,pedicure At Home,home-TeluguStop.com

అలా చేయని వారిలో మచ్చలు, పగుళ్లు, నలుపు రంగు హేళన చేసినట్టుగా కనిపిస్తుంది.అయితే అలాంటి వారు ఇప్పుడైనా ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల మీ సమస్యలకి ఇట్టే పరిష్కారం చూపవచ్చు.

పాదాలు అందానికే కాదు.వ్యక్తిత్వానికి కూడా ప్రతిబింబం.

పాదాలు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అయితే ఎవరైతే పాదాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారి పాదాలు మాత్రమే అందంగా ఉంటాయి.

పాదాల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా ఉన్న అందం పోయి.పాదాలు మురికిగా తయారవ్వడమే కాదు పగుళ్లు కూడా వస్తాయి.

అయితే పాదాలను అందంగా మార్చడానికి కొన్ని చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tipsbeautiful, Cracked Heels, Feet Care Tips, Care, Green Tea Bags, Lemon

బకెట్ గోరువెచ్చని నీటిలో కొంచెం షాంపూ లేదా ఉప్పును వేయండి.దీంట్లో మీ పాదాలను ముంచండి.15 నిమిషాల తర్వాత వైప్ కూడా చేయొచ్చు.కావాలనుకుంటే తర్వాత మీ పాదాలకు ఆయిల్ లేదా క్రీమ్ ను అప్లై చేయొచ్చు.

ఇది మీపాదాలకున్న మురికిని తొలగించి.అందంగా మారుస్తుంది.

పాదాల సంరక్షణకు నిమ్మకాయ కూడా అద్భుుతంగా పనిచేస్తుంది.ఇందుకోసం గోరువెచ్చని నీళ్లను తీసుకుని ఉప్పు, కొద్దిగా నిమ్మరసాన్ని మిక్స్ చేయండి.

దీనిలో మీ పాదాలను ముంచండి.ఆ తర్వాత మీ పాదాలకు నిమ్మరసాన్ని రుద్దండి.

ఇది మీ పాదాలపై ఉన్న నల్లని మచ్చలను తొలగించడంతో పాటుగా డ్రై స్కిన్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Telugu Tipsbeautiful, Cracked Heels, Feet Care Tips, Care, Green Tea Bags, Lemon

గుడ్లు, ఆముదం, నిమ్మకాయ మీ పాదాల పగుళ్లలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.ఇందుకోసం ముందుగా గుడ్డును పగలగొట్టి పచ్చసొనను తీసివేసేయండి.దీనిలో కొన్ని చుక్కల ఆముదం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కలపండి.

దీనికి ఒక స్పూన్ బియ్యప్పిండిని కూడా కలపండి.ఈ మిశ్రమాన్ని కొన్ని నిమిషాల పాటు కూల్ ప్లేస్ లో పెట్టండి.

అయితే దీన్ని ఉపయోగించడానికి ముందు మీ పాదాలను శుభ్రంగా గోరువెచ్చని నీటితో కడగండి.ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మీ పాదాలకు రాయండి.10 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి.వారానికి మూడు సార్లు ఈ పద్దతిని ఫాలో అవ్వండి.

ఈ మిశ్రమాన్ని పగటిపూట లేదా రాత్రిపూట అప్లై చేయొచ్చు.

పాదాలను అందంగా మార్చడానికి రోజ్ వాటర్ కూడా ఉపయోగపడుతుంది.

ఇందుకోసం రోజ్ వాటర్, గ్లిజరిన్, నిమ్మరసం కొద్దిగా తీసుకుని అన్నింటినీ బాగా కలగలపండి.ఈ మిశ్రమాన్ని కాళ్ల పగుళ్లపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి.

ఇది పగుళ్లను చాలా తక్కువ రోజుల్లో పోగొడుతుంది.

Telugu Tipsbeautiful, Cracked Heels, Feet Care Tips, Care, Green Tea Bags, Lemon

ఒక బకెట్‌లో గోరువెచ్చని నీరు తీసుకోండి.అందులో నాలుగు గ్రీన్‌ టీ బ్యాగ్‌లని వేయండి.టీ బ్యాగులు నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడగండి.

అలాగే బకెట్‌లో కొంచెం ఉప్పు కలపండి.తర్వాత పాదాలని 10 నుంచి 15 నిమిషాలు బకెట్‌లో ఉంచండి.

తర్వాత బాగా రుద్దండి.దీంతో చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

ఆ తర్వాత పాదాలకి మంచి మాయిశ్చరైజర్‌ను రుద్దండి.తరచుగా ఇలా చేస్తే పాదాలు అందంగా మెరుస్తాయి.

గ్రీన్ టీ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.అలాగే, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.

సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే పొందాలంటే గ్రీన్ టీని తగు మోతాదులో తీసుకోవాలి.మంచి ఆరోగ్యం కోసం రోజుని ఒక కప్పు గ్రీన్ టీతో మొదలు పెట్టండి.

ఏదైనా పరిమితిలో తీసుకోవాలి.ఎక్కువగా తీసుకుంటే అనర్థాలకి దారి తీస్తుంది.

పెద్దలు ఎపుడు చెబుతుంటారు అతి సర్వత్రా వర్జయేత్ అని…

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube