5 ఏళ్ల వయసులోనే రోప్ క్లైంబింగ్‌ లో అమోఘమైన ప్రతిభ.. కానీ..??

ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిలోనూ ఎదో ఒక టాలెంట్ అనేది కచ్చితంగా ఉండే ఉంటుంది.కానీ ఆ ప్రతిభను గుర్తించి దానిని సరైన మార్గంలో ఉంచితే గుర్తింపు అనేది ఉంటుంది.

 Amazing Talent In Rope Climbing At The Age Of 5. But  Five Year Old, Salivaganan-TeluguStop.com

కొంతమందిలో ప్రతిభ అనేది ఉన్నాగాని ఎవరు పట్టించుకోకపోవడం వలన అది మరుగున పడిపోతుంది.అయితే ఇలాంటి వారినీ కాస్త ప్రోత్సహిస్తే వాళ్ళు ఎన్నో రకాలు అయిన అద్భుతాలు సృష్టిస్తారు.‘ పిట్ట కొంచెం కూత ఘనం ‘ అనే సామెతను మీరు ఎప్పుడన్నా విన్నారా.?! దీని అర్ధం ఏంటంటే పిట్ట చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ దాని అరుపు మాత్రం బాగా వినిపిస్తుంది అని అర్ధం అన్నమాట.అలాగే తమిళనాడుకు చెందిన ఒక ఐదేళ్ల బాలుడు సాలివగనన్‌ లోని టాలెంట్ కూడా అలాంటిదే.బుడ్డోడు చూడడానికి మాత్రమే చిన్నోడు కానీ వాడి టాలెంట్ మాత్రం అమోఘం.

అసలు వివరాల్లోకి వెళితే తమిళనాడులోని శివగంగ జిల్లాలోని సురక్కులం గ్రామానికి చెందిన వినోద్ కుమార్, కర్పగవల్లి దంపతుల కుమారుడు సాలివగనన్‌.ఈ బుడ్డోడికి చెట్లు ఎక్కడం అంటే మహా సరదా.

ఒక రోజు తమ కుమారుడు చెట్లు ఎక్కడం చూసి ఆశ్చర్యపోయిన తల్లి తండ్రులు కొన్ని రోజుల తర్వాత ఒక 14 ఫీట్ల వెదురుబొంగును తీసుకొచ్చి ఎక్కమని చెప్పారు.దాన్ని కూడా కేవల 20 సెకన్లలో ఎక్కేశాడు.

సాలివగనన్‌ ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అసాధ్యమైన పని.

Telugu Feet, Seconds, Climbs, Salivaganan, Tamilnadu-Latest News - Telugu

కానీ సాలివగనన్‌ మాత్రం చాలా సులువుగా ఎక్కేసాడు.అయితే తమ కుమారుడిలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి, అలాగే అతడికి సరైన శిక్షణ ఇప్పించేందుకు సాలివగనన్‌ తల్లిదండ్రులు ప్రయత్నించారు.కానీ 14 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే శిక్షణ ఇస్తారంటూ చిన్న పిల్లలకు ఇవ్వరు అంటూ ఆ జిల్లా కలెక్టర్ వీరి విజ్ఞప్తిని తిరస్కరించారు.

అయితే తమ కుమారుడికి రోప్ క్లైంబింగ్‌ మీద ఆసక్తి ఉందని ఈ వయసు నుంచే ట్రైనింగ్ ఇస్తే భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించి దేశానికీ మంచిపేరు తెస్తాడని తల్లిదండ్రులు భావిస్తున్నారు.చూడాలి మరి ఈ బుడ్డోడు ముందుముందు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube