తానా “క్యూరీ” పోటీలకు భారీ స్పందన...

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘం “తానా” అమెరికాలో ఉండే తెలుగు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన అతిపెద్ద సంస్థగా తానా రూపుదిద్దుకుంది.తెలుగు వెలుగు కోసం అమెరికాలో పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా, ఎన్నో సేవా, చైతన్య కార్యక్రమాలు చేపడుతోంది.

 Amazing Response For Tana-curie Competitions, Tana-curie Competitions, Tana To-TeluguStop.com

అలాగే పిల్లలో దాగిఉన్న అసామాన్య ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారిని పలు రంగాలలో నిష్ణాతులుగా తీర్చి దిద్దడంకోసం పలు రకాల తర్ఫీదులు ఇస్తూ, పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే తానా పిల్లల మెదడుకు పదును పెట్టేందుకుగాను క్యూరీ లెర్నింగ్ సంస్థతో కలిసి ఓ చక్కని కార్యక్రమం రూపొందించింది.

ఈ కార్యక్రమానికి పిల్లల నుంచీ భారీ స్పందన వచ్చింది.వివరాలలోకి వెళ్తే.


తానా –క్యూరీ సంస్థ సంయుక్తంగా పిల్లలలో ప్రతిభను వెలికితీసేందుకు మాథ్స్, సైన్స్ లలో పోటీలు నిర్వహించారు.ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు పిల్లల నుంచీ భారీ స్పందన లభించింది.

సుమారు 650 మంది పిల్లలు వర్చువల్ విధానం ద్వారా ఈ పోటీలలో పాల్గొన్నారు.పోటీలలో పాల్గొన్న విద్యార్ధులను వారి వారి తరగతుల ద్వారా 3 గ్రూపులు గా విభజించారు.11 – 12 గంటల వరకూ సైన్స్ పోటీలను మాథ్స్ పోటీలను, 1-2 గంటల వ్యవధిలో సైన్స్ పోటీలు నిర్వహించారు.అలాగే 3-4 తరగతుల వారిని ఒక విభాగంగా, 5-6 తరగతుల వారి మరో విభాగంగా, అలాగే 7-8 తరగతుల వారిని మరొక విభాగంగా విభజించారు.

ఈ పోటీలలో పాల్గొన్న పిల్లలు అసామాన్య ప్రతిభ కనబరిచారని, ఎంతో ఉశ్చాహంగా పాల్గొన్నారని క్యూరీ సంస్థ వ్యవస్థాపకులు డా మూల్పూరి వెంకట్రావు తెలిపారు.ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా పిల్లలో దాగున్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, అయితే ఈ పోటీ పరీక్ష పిల్లలను ఎంతగానో ఆకట్టుకుందని , పిల్లల కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి తానా ఎప్పుడూ ముందు ఉంటుందని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube