అమెజాన్ ప్రైమ్ లో ఆకట్టుకుంటున్న ముగ్గురు మొనగాళ్ళు సినిమా!

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం “ముగ్గురు మొనగాళ్ళు”.ఇందులో శ్రీనివాస్ రెడ్డి ఆందుడిగా కనిపించగా, దీక్షిత్ శెట్టికి మాటలు రావు, వెన్నెల రామారావుకు వినిపించదు.

 Amazing Response For Mugguru Monagallu Movie In Amazon Prime-TeluguStop.com

ఇలా ముగ్గురు అంగవైకల్యంతో బాధపడుతూ నటించిన చిత్రం ముగ్గురు మొనగాళ్ళు.ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు ప్రేక్షకులలో ఎన్నో అంచనాలను క్రియేట్ చేశాయి.

ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

 Amazing Response For Mugguru Monagallu Movie In Amazon Prime-అమెజాన్ ప్రైమ్ లో ఆకట్టుకుంటున్న ముగ్గురు మొనగాళ్ళు సినిమా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంగవైకల్యంతో బాధపడుతున్న ముగ్గురు యువకులు ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు వారు ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారనే విషయం ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఈ ముగ్గురు ఈ చిత్రంలో నటించడం కాకుండా జీవించారని చెప్పవచ్చు.ఈ చిత్రంలో కేవలం సస్పెన్స్ థ్రిల్లింగ్ మాత్రమే కాకుండా హాస్యం కూడా ఎంతో అద్భుతంగా పండించారు.

ఈ సినిమాకు గరుడ ఫేమ్ అంజి అందించిన విజువల్స్ , సురేష్ బొబ్బిలి సంగీతం చిన్నా నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరింత విజయాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు.ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ 2 ప్లేస్ స్ట్రీమింగ్ అవడం గమనార్హం.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ముగ్గురు మొనగాళ్ళు చిత్రాన్ని చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అచ్యుత్ రామారావు నిర్మించారు.

#Amazon Prime #Srinivas Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు