బంగాళాదుంప జ్యుస్ త్రాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు  

బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు దాదాపుగా ఎవరు ఉండరు. బంగాళదుంపతో కూర,ఫ్రై వంటివి చేసుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఇలా తినటం కన్నా బంగాళాదుంపను జ్యుస్ రూపంలో తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బంగాళాదుంప జ్యుస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన రెగ్యులర్ గా త్రాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

-

బంగాళదుంప తింటే బరువు పెరుగుతారని చాలా మంది తినటం మానేస్తు ఉంటారు. అయితే బంగాళాదుంప జ్యుస్ త్రాగితే బరువు తగ్గుతారని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి.

బంగాళాదుంప జ్యుస్ లో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

బంగాళాదుంపలో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన కండరాలకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక హై బిపిని తగ్గిస్తుంది. హై బిపి తగ్గటంతో రక్త సరఫరా మెరుగుపడి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

బంగాళాదుంపలో మనకు రోజువారీగా కావల్సిన బి విటమిన్లు 40 శాతం వరకు లభిస్తాయి. దీని వల్ల నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జుట్టుకు పోషణ లభిస్తుంది.

బంగాళాదుంపలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయి.