వైట్ హెయిర్‌కు బై బై చెప్పాలా? అయితే మీరిది ట్రై చేయాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో చిన్న వ‌య‌సులోనే వైట్ హెయిర్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది.జీవ‌న శైలిలో వ‌చ్చే మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, కాలుష్యం, ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, హార్మోన్ ఛేంజ‌స్‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌ల్ల‌గా ఉండాల్సిన జుట్టు తెల్ల‌గా, అంద‌విహీనంగా మారుతుంది.

 Amazing Pack To Get Rid Of White Hair! Hair Pack, White Hair, Latest News, Hair-TeluguStop.com

దాంతో ఏం చేయాలో అర్థం గాక‌, ఎలా ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌త‌మైపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ అండ్ సూప‌ర్ ప్యాక్‌ను ట్రై చేస్తే గ‌నుక‌.

చాలా అంటే చాలా సుల‌భంగా వైట్ హెయిర్ స‌మ‌స్య‌కు బై బై చెప్ప‌వ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ప్యాక్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? ఏ విధంగా యూజ్ చేయాలి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

Telugu Tips, Black, Care, Care Tips, Pack, Latest, White-Telugu Health

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ప్పు క‌ల‌బంద ముక్క‌లు, నాలుగు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె, నాలుగు స్పూన్ల ఉసిరి కాయ పొడి వేసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.ఈ మిశ్ర‌మంలో ఒక పూర్తి ఎగ్‌ను మిక్స్ చేసుకుంటే.హెయిర్ ప్యాక్ సిద్ధ‌మైన‌ట్లే.

ఇక ఇప్పుడు ఈ ప్యాక్‌ను ఎలా వాడాలో తెలుసుకుందాం.

మొద‌ట చిన్న గిన్నెలో ఒక స్పూన్ చొప్పున ఆముదం, బాదం ఆయిల్  వేసుకుని బాగా మిక్స్ చేసి.

ఆపై గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు హీట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఆయిల్‌ను జుట్టుకు ప‌ట్టించి క‌నీసం గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం త‌యారు చేసుకున్న ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.న‌ల‌బై నిమిషాల త‌ర్వాత మైల్డ్ షాంపూతో చ‌క్క‌గా హెడ్ బాత్ చేసేయాలి.

ఇలా వారానికి ఒక సారి చేస్తే తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల బ‌డుతుంది.అదే స‌మ‌యంలో హెయిర్ ఫాల్ స‌మ‌స్య సైతం దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube