ఇలా చేస్తే మీ అందం..మరింత పదిలం..  

  • మనిషి అందంగా కనపడటానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదులేచిన దగ్గరనుంచీ యోగా తో మొదలుపెట్టి పడుకునే ముందు పేస్ ప్యాక్ తో ముగిస్తారు.బ్యూటీ పార్లర్స్మార్కెట్ లో దొరికే విలువైన సౌందర్య సాధనాలు ఖర్చుతో కూడుకున్న సరే లెక్కచేయరు.కానీ ప్రక్రుతి సిద్దమైన చిట్కాలు పాటిస్తే మనం డబ్బులు వృధా చేయకుండా ఇంట్లోనే సౌందర్య సాధనాలు చేసుకోవచ్చు ఎలా అంటే…

  • నిమ్మరసం అందాన్ని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది…కొంచం నిమ్మరసాన్ని తీసుకునిదానికి కొంచం మునగ ఆకు రసాన్ని కలిపి ముఖానికి రోజు ఉదయం పూట రాసుకుంటే మొటిమలు పోతాయిసౌందర్యం పెరుగుతుంది.వారానికి రెండు సార్లు శరీరానికి శనగపిండితో నలుగు పెట్టుకుంటే వంటిమీద నలుపు ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతుంది.చర్మం కాంతివంతంగా కనపడుతుంది.

  • చాలా మంది ముల్తానా మట్టి వాడుతూ ఉంటారుకానీ దానిలో కొంచం పాల మీగడ వేసి కలిపి ముఖానికి పేస్ ప్యాక్ లా పట్టిస్తేమీ చర్మం చాలా మృదువుగా తయారవుతుంది గ్రీన్ టీ క్రమం తప్పకుండా రోజుకి మూడుసార్లు దీనిని త్రాగటం వలన శరీరంలో అక్కడక్కడా ఏర్పడే అధిక కొవ్వుని కరిగిస్తుందిఅంతేకాదు గంధం చిక్కని సానామీద అరగదీసిదానిలో కొంచం పెరుగు కలిపి మొఖానికి పట్టిస్తేమొఖంమీద ఉండే నల్ల మచ్చలు పోతాయిఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే సౌందర్య సాధనాలని చేసుకోవచ్చు