సాదారణముగా మనం కూరల్లో రుచి కోసం సముద్రం నుంచి తీసిన ఉప్పుని వాడుతూ ఉంటాము.అయితే ఉప్పును సైంధవ లవణం అని కూడా అంటారు.
ఈ ఉప్పును రసాయనిక భాషలో సోడియం క్లోరైడ్ (NaCl) అని కూడా పిలుస్తూ ఉంటారు.అయితే మన భారతదేశంలో మనం వాడే ఉప్పు కాకుండా రాతి ఉప్పు కూడా ప్రచారంలో ఉంది.
ఈ రాతి ఉప్పును ‘హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్’ లేదా ‘హిమాలయన్ ఉప్పు’ అని కూడా పిలువడం జరుగుతోంది.ఈ రాతి ఉప్పు ఎక్కడ పడితే అక్కడ దొరకడం కష్టం.
కేవలం హిమాలయ పర్వత ప్రాంతంలో సాధారణంగా లభిస్తుంది.రాతి ఉప్పును ఉప్పు గనుల నుండి తేమ లేకుండా పొడిగ్ సేకరిస్తారు.
స్వఛ్చమైన రాతి ఉప్పు సాధారణంగా రంగు లేకుండా ఉంటుంది లేదా తెలుపు రంగులో ఉంటుంది.హిమాలయన్ (రాతి) ఉప్పుయొక్క ఉత్తమ లక్షణం ఏమంటే అది ప్రకృతిసిద్ధంగా ఎలాంటి రసాయనిక పదార్థాల కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభిస్తుంది.
మరి ఈ సైంధవ లవణంతో ఆరోగ్యానికి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఈ ఉప్పును వాడడం వలన ఆకలి అనేది పెరుగుతుంది.అలాగే ఈ రాళ్ళ ఉప్పులో ఎక్కువగా కాల్షియం,మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు ఉంటాయి.ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
లాలాజలం, జీర్ణరసాల సమన్వయంలో ఇది తోడ్పడుతుంది.దీనికున్న లక్షణంతో కడుపులో గ్యాస్ రాకుండా చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం ఈ సైంధవ లవణాన్ని సోంఫు, కొత్తిమీర పొడి మరియు జీలకర్రతో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది.అలాగే లో బీపీ ఉన్నవారు చిటికెడు రాళ్ళ ఉప్పును నీటిలో వేసి రోజుకు రెండు సార్లు తీసుకోటంతో బీపీ అదుపులో ఉంటుంది.
అయితే అధిక బిపి ఉన్నవారు మాత్రం దీన్ని తాగకూడదు.
అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం రాళ్ళ ఉప్పు శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది.
ఇందులో ఉండే ఖనిజ లవణాలు కొవ్వు కణాలను కూడా తొలగిస్తాయి.అలాగే గొంతు నొప్పితో బాధ పడేవారు గోరువెచ్చని ఉప్పునీరుతో పుక్కిలించటం వలన నొప్పి తగ్గి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
మన పూర్వ కాలంలో మన పెద్దవాళ్ళు ఈ రాళ్ళ ఉప్పుతోటి పళ్ళను శుభ్రం చేసుకునే వారు.ఈ ఉప్పుతో పళ్ళను శుభ్రం చేసుకోవడం వలన పళ్ళు తెల్లగా మారతాయి.
అలాగే నోటి దుర్వాసన కూడా పోతుంది.త్రిఫల, వేప పౌడర్లతో కలిపి దీనిని వాడడం వలన చిగుళ్ల సమస్యలు నివారించవచ్చు.