ముల్లంగి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా...?

ముల్లంగి.మార్కెట్లో, కూరగాయల షాప్ లో బాగా లభించే వాటిలో ఇవి ఒక రకం.సంవత్సరం పొడవునా వీటి లభ్యత ఉండనే ఉంటుంది.ఇకపోతే ముల్లంగి అనేది ఒక కూరగాయ మాత్రమే కాదు.

 Wonderful Benefits Of Raddish, Radish, Health Benefits, Healthy Food, Face Mask,-TeluguStop.com

అందులో చాలా అవసరమయ్యే గుణాలు మనకు లభిస్తాయి.కాబట్టి వీటిని వారానికి ఒకటి లేదా రెండుసార్లు తింటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది.

తరచుగా వచ్చే దగ్గు, ముక్కు, చెవి, గొంతు నొప్పులతో బాధపడే వారికి ఈ ముల్లంగి కాస్త మేలు చేకూరుస్తుంది.అంతేకాకుండా ఈ ముల్లంగి వాడడం ద్వారా ఎలాంటి ఉపయోగాలో ఒకసారి చూద్దామా…

కొంతమందికి ఊపిరితిత్తుల్లో ఏదో అడ్డుతగులుతున్న అడ్డుగా ఉన్న నేపథ్యంలో చీటికిమాటికి దగ్గుతూ ఉంటారు.

ఇందుకు ప్రధాన కారణం బ్రాంకైటిస్.ఇది తగ్గుదల కావాలంటే మనం ముల్లంగి తో తయారు చేసిన ముల్లంగి జ్యూస్ లో కాస్త తేనె కలిపి తాగితే బ్రాంకైటిస్ కొద్దిమేర పరిష్కారం లభిస్తుంది.

అలాగే కిడ్నీ లో సమస్యలు ఉండేవారు కూడా రోజుకొకసారి ముల్లంగి ఆకుల రసం తాగితే ఎంతో రిలీఫ్ దొరుకుతుంది.కేవలం కిడ్నీ సమస్యలు మాత్రమే కాకుండా రక్తపోటు, ఎక్కడైనా శరీరంలో వచ్చే వాపులకు కారణమయ్యే బ్యాక్టీరియా పోరాడడానికి ఈ ఆకుల రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇలా ఆకుల పచ్చి రసం తాగలేని వారు తేనెను కలుపుకొని కూడా తాగవచ్చు.

అలాగే అధిక బరువు ఉన్నవారు, షుగర్ తో బాధపడేవారు ఈ ముల్లంగి తో చేసిన కూరలు తింటే ఆకలిని కంట్రోల్ చేయడం తో కాస్త బరువు తగ్గవచ్చు.

అలాగే షుగర్ తో బాధపడుతున్నారు వీటివల్ల కాస్త ఆకలిని మందగించవచ్చు.అంతేకాదు ముల్లంగి కి సంబంధించి గింజలను తీసుకొని వాటిని బాగా నూరి ఆ తర్వాత ఫేస్ మాస్క్ లా వేసుకొని ఒక అరగంట తర్వాత నీటితో కడిగేస్తే ముఖం పై ఉండే మొటిమలు, మచ్చలు, ఆయిల్ ఫేస్ లాంటి బాధలు చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది.

అంతేకాదు వీటి వల్ల మనకు శరీరంలో ఐరన్, పొటాషియం అనేక రకాల ఖనిజాలు మనకు లభిస్తాయి.వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా చాలా మెరుగుపడుతుంది.దీంతో ఏదైనా మలబద్ధకం సంబంధించి ఇబ్బంది పడుతుంటే వాటికి మంచి పరిష్కారం లభిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube