ఈ ఆకుతో ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసుకోండి  

Amazing Health Benefits Of Ponnaganti Koora-

ఆకుకూరల్లో ఎన్ని రకాలు ఉన్నా పొన్నగంటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.ఎందుకంటే ఈ కూరలో ఉన్న పోషకాలు మరి ఏ ఆకుకూరలోను లేవు.

పొన్న గంటి కూర లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి.అంతేకాకుండా ప్రోటీన్స్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి.తోటకూర మాదిరిగానే ఈ ఆకుకూరతో కూడా అనేక రకాల వంటలను చేసుకోవచ్చు.ఆ ఆకుకూర రుచి కూడా బాగుంటుంది.అందువల్ల పప్పు లేదా ఇతర కూరలతో కలిపి వండుకోవచ్చు

-

పొన్నగంటి కూరలో విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి

పొన్నగంటి కూరలో ఉన్న పోషకాలు కంటికి చాలా మేలు చేస్తాయి.అంతేకాక రక్తహీనతను అరికడుతుంది.అందువల్ల రక్తం తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది

రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

మొలలతో బాధ పడేవారికి పొన్నగంటి కూర ఆకులు, ఉల్ల్లిపాయలు, మిరియాలతో చేసిన సూప్ త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది

పొన్నగంటి కూర లో లభించే నూనే పదార్ధాలు అధిక రక్త పోటును తగ్గిస్తాయి,అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి

పొన్నగంటి ఆకులు నిద్ర లేమి సమస్యతో బాధపడేవారికి గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది, అలాగే జ్ఞాపక శక్తి ని పెంచటంలో సహాయపడుతుంది.

తాజా వార్తలు