ఇది తెలిస్తే ఒక్క జామకాయ రూ.200 అయిన సరే తప్పకుండా కొని తింటారు  

 • మన పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటూ ఉంటారు. ఎన్ని ఆస్థి పాస్తులు ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా అన్నీ కొల్చుకుని తినాల్సి వస్తోంది. ఎందుకంటే చాలా రోజులు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అయితే ఏ పండు మంచిది అంటే ఆ పండును ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అయితే పెరట్లో కాసే జామ చెట్టులో ఎన్ని పోషకాలు ఉన్నాయో గమనించం. జామకాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు జామ కాయ తింటారు.

 • Amazing Health Benefits Of Guava Fruit In Telugu-Health

  Amazing Health Benefits Of Guava Fruit In Telugu

 • ఈ జ్యూస్‌ను తీసుకోవడంవలన రక్తంలోని కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాకుండా కాలేయానికి మంచి టానిక్.

 • జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను బాగా తగ్గించవచ్చు. ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది. కాబట్టి మధుమేహ రోగులు ప్రతి రోజు ఒక జామకాయ తింటే చాలా మంచిది.

 • Amazing Health Benefits Of Guava Fruit In Telugu-Health
 • జామలో అతితక్కువ క్యాలరీలు. తక్కువ కొలెస్ట్రాల్. ఎక్కువ పోషక విలువలు ఉంటాయి.

 • ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకంను నివారిస్తుంది.

 • A, B, C విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వయస్సు రీత్యా వచ్చే ముడతలు తగ్గుతాయి.

 • జామపండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిలో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్, లైకోపిన్ ఉండడం వల్ల ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది.

 • జామకాయ లో ఉండే పొటాషియం గుండె జబ్బులు, బీపి పెరగకుండా చేస్తాయి.

 • అంతే కాకుండా జమకాయలో B కాంప్లెక్స్ విటమిన్స్ (B6, B9), E, K విటమిన్స్ ఉంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో జామకాయ ఎంతగానో సహాయపడుతుంది.