సీతాఫలంలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలిస్తే అసలు వదలరు  

 • ఈ సీజన్ లో సీతాఫలం విరివిగా దొరుకుతుంది. సాధారణంగా సీతాఫలం అంటే ఇష్టం లేని వారు ఉండరు. వర్షాకాలం చివరి రోజుల్లో శీతాకాలం మొదటి రోజుల్లో సీతాఫలాలు ఎక్కువగా దొరుకుతాయి. సీతాఫలం తియ్యగా ఉండి తినటానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు.సీతాఫలంలో కాల్షియమ్,విటమిన్ ‘సి’, పీచు పదార్ధం, కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.

 • గుండె సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గుండె కొట్టుకొనే తీరును క్రమబద్దీకరణ చేయటంలో చాల సహాయపడుతుంది.

 • మలబద్దకంతో బాధపడేవారు ప్రతి రోజు ఒక పండు తింటే ఆ సమస్య నుండి బయట పడతారు.

 • పోటాషియం సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రసరణ బాగా జరిగేలా సహాయపడుతుంది.

 • సీతాఫలంలో ఉండే మెగ్నీషియం శరీరంలో ఉండే కండర వ్యవస్థని గట్టిపరుస్తుంది.

 • గుండె జబ్బులు ఉన్నవారు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు దీన్ని అల్పాహారంగా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.


 • ఒక్క సీతాఫలం పండే కాదు ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

 • సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు.

 • గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది.

 • మధుమేహ వ్యాధి గ్రస్తులు, అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ పండును డాక్టర్ సలహాతో మాత్రమే తినాలి.

 • జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు సీతాఫలాన్ని చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.

 • ముఖ్యమైన గమనిక మోతాదుకు మించి తీసుకోకూడదు. కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో వేడినీరు తాగినా అర స్పూన్ వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది.

 • ఇన్ని ప్రయోజనాలు ఉన్నా సీతాఫలాన్ని తప్పకుండా తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.