మంత్రోచ్ఛారణతో రోగనిరోధక శక్తి పెరుగుతుందా ?  

పురాతన శాస్త్రాలైన వేదాలను ఆయుర్వేదంతో సమానంగా పోలుస్తారు. ఎందుకంటే కొన్ని వేద మంత్రాలను ఉచ్చరించటం వలన శరీరంలో కొన్ని రకాల శక్తులు ఉత్పన్నం అవుతాయి. అలాగే ధ్యానం చేసినప్పుడు కూడా శరీరానికి నూతన ఉత్తేజం రావటం మనం గమనిస్తూ ఉంటాం.

వేద మంత్రాలను ఉచ్చరించటం వలన ఆధ్యాత్మిక భావన కలగటమే కాకుండా శరీర కీలక అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా అందం, ఆరోగ్యం పెరగటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మంత్రాలను ఉచ్చరించటం వలన స్వరపేటిక,నాలుక, పెదవులు, స్వర తంత్రుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ముఖ్యమైన అవయవాలపై ఒత్తిడిని కలిగిస్తాయి.

ఈ ఒత్తిడి హైపోథాలమస్ గ్రంథి మీద పనిచేయటం వలన రోగ నిరోధకతతోపాటు అనుకూలమైన హార్మోన్లు విడుదల అయ్యి శరీరం అంతా ఉద్దీపన కలగటం వలన అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. మంత్రాలను ఉచ్చరించటం వలన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై అవయవాలు వాటి విధులు సక్రమంగా నిర్వహిస్తాయి. ఆ తర్వాత శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించటం వలన శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ బాగా సరఫరా అయ్యి రక్తం ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో గుండె పనితీరు బాగుంటుంది.