మిరియాల పొడి, పసుపు కలిపి రాస్తే మొటిమలు రెండు రోజుల్లో మాయం  

రుచిలో ఘాటుగా,కారంగా ఉండే మిరియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. మిరియాల్లో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, పీచు, కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. మిరియాలను ‘కింగ్‌ ఆఫ్‌ స్పైసీస్‌’ అని అంటారు.

మిరియాల్లో సమృద్ధిగా ఉండే పిపరైన్‌, చావిసైన్‌‌లు శరీరంలో కఫాన్ని తగ్గించటానికి,జలుబు, దగ్గు తగ్గించటానికి మరియు జీర్ణక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది. అలాగే పొట్టలో ఏర్పడే అపాన వాయువులను బయటకు పంపిస్తాయి. రక్త ప్రసరణను వేగవంతం చేసి శరీరంలో కొవ్వు పెరగకుండా చేస్తాయి. మిరియాల పొడి, నెయ్యి కలిపి రాస్తే చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అధిక బరువు, కీళ్లవాతం, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మిరియాలు చాలా మేలు చేస్తుంది.

పసుపులో మిరియాలపొడి కలిపి కొంచెం నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట తరవాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే నాలుగు రోజుల్లో మొటిమలు మాయం అవుతాయి.

గాయాలు అయ్యినప్పుడు గాయాల మీద మిరియాల పొడిని జల్లితే యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి రక్తస్రావాన్ని అరికడుతుంది.

మిరియాలు, శొంఠి పొడిలో తేనె కలిపి రోజు విడిచి రోజు తీసుకుంటే ఈ కాలంలో వచ్చే దగ్గు సమస్యలు తగ్గిపోతాయి.

దంత సమస్యలతో బాధపడుతున్నవారు మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.