మెదడుకి ఆరోగ్యాన్ని అందించే బీట్రూట్..       2017-09-23   01:52:30  IST  Lakshmi P

మనం రోజువారీ తినే కాయగూరల్లో పోషక విలువలు చాలానే ఉంటాయి. కానీ వీటన్నిటిలో ప్రత్యేకమైన గుణం కలిగినవి బీట్రూట్స్..ఇవి దుంప జాతికి చెందినవి..దీనిలో ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషక గుణాలు మానవ శరీరాన్ని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి..బీట్రూట్స్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం

అధిక రక్తపోటు తగ్గడానికి బీట్రూట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది.అందుకే మనం తినే ఆహారంలో దీనిని ఒక భాగంగా చేసుకోవచ్చు. మెదడు ఆయుష్షును పెంచుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ పుష్కలంగా ఉంటుంది..ఈ నైట్రేట్ మనం వ్యాయామం చేసినప్పుడు త్వరగా అలసిపోకుండా చేస్తుంది, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి తోడ్పడుతుంది.

బీట్రూట్ మెదడుకి ఆక్సిజన్ సరపరాని వేగంగా చేస్తుంది..దీనిలో ఉండే ఇంకొక ప్రత్యేకమైన గుణం ఏమిటంటే బీట్రూట్ లో ఉండే నైట్రేట్‌ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు ఉత్తేజపరుస్తుంది.బీట్రూట్ ద్వారా వచ్చే జ్యుస్ త్రాగడం వలన రక్తం వృద్ధి చెందుతుంది.

,