తరుచూ ఉసిరి తింటే ఎన్ని లాభలో తెలుసా?!

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ఇబ్బంది పడే దీర్ఘకాలిక సమస్యల్లో మధుమేహం ఒకటి.కొన్ని సర్వేల ఫలితంగా ప్రపంచంలో ప్రజలలో ఎక్కువగా ఇబ్బంది పడుకున్నట్లు గణాంకాలు తెలిపాయి.

 Amazing Health Benefits Of Amla, Diabetes, Bad Cholestrol, Amla Benefits, Ayurve-TeluguStop.com

అయితే ఈ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాకపోయినప్పటికీ వాటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు తెలిపాయి.అయితే వ్యాధిని కంట్రోల్ లో ఉంచడానికి క్రమం తప్పకుండా ఉసిరికాయ తీసుకోవడం ఎంతో అవసరం అని కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు.

అయితే డయాబెటిస్ అలాగే ఉసిరికాయ కు ఉన్న సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.? అయితే పూర్తి విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా మధుమేహం రావడానికి గల కారణం శరీరంలో విటమిన్ C లోపం ఎక్కువగా ఉండడం వల్లనే అని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి.మనకి అందరికీ తెలిసిందే ఉసిరికాయలో విటమిన్ సి ఎంత పుష్కలంగా లభిస్తుందో.

ఉసిరికాయ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత శరీరం లోపల ఆక్సీకరణ ఒత్తిడి స్థాయిని తగ్గించడం మొదలు పెడుతుంది.వాటి వల్ల రక్తంలో ఉండే చక్కెర అధికశాతం తగ్గేందుకు సహాయపడుతుంది.

కేవలం షుగర్ వ్యాధి మాత్రమే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుండి ఈ ఉసిరి మనల్ని కాపాడుతుంది.అవేంటో ఒకసారి చూద్దామా.


ముందుగా రక్తంలోని ట్రైగ్లిక్రోడీస్ స్థాయిలను అదుపులోకి తీసుకు వస్తాయి.అలాగే కిడ్నీకి ఏమైనా సంబంధిత వ్యాధులు వచ్చేలా ఉండే వాటిని నివారించడానికి ఉపయోగపడుతుంది.

వీటితో పాటు కొంతమంది వారికి తెలియకుండానే కొన్ని క్యాన్సర్ కు గురవుతుంటారు.అలాంటి దాడులను నివారించేందుకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతోంది.

అలాగే ఆయుర్వేదంలో గొంతు నొప్పి సమస్యలకు ఎక్కువగా ఉసిరిని ఉపయోగిస్తారు.ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్లు వలన చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది.

ముఖ్యంగా ఈ ఉసిరిని తరచుగా తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధకశక్తి ఎంతగానో మెరుగుపడుతుంది.దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా వైరస్ లాంటివి అసలు దరిచేరవు.

ముఖ్యంగా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గించేస్తుంది.విటమిన్ C ద్వారా దృష్టిని మెరుగు పరుచుకోవచ్చు.

వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా శరీరం వయస్సు తక్కువ కనబడేలా చేస్తుంది.అలాగే జీర్ణక్రియ సంబంధిత వ్యాధులకు సంబంధించి కూడా ఉసిరికాయ ఎంతో బాగా పనిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube