మహాభారతం ప్రకారం రహస్యాలను ఆ ఆరుగురికి తెలియకూడదు... ఎవరు వారు తెలుసా?

మహాభారతంలోని ఒక భాగంను భగవద్గీతగా చెప్పుకోవచ్చు.భగవద్గీతలో ఎన్నో అద్బుతమైన జీవిత సత్యాలు ఇంకా పలు మంచి పనుల గురించి చెప్పడం జరిగింది.

 Amazing Facts Of Mahabharata1-TeluguStop.com

మహాభారతంలో మొత్తం ఒక లక్ష వరకు శ్లోకాలు ఉంటాయి.ఆ శ్లోకాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎంతో గొప్ప అర్థంను కలిగి ఉంటుంది.

అలాంటి స్లోకాలు జీవితం బాగు పడేందుకు చాలా ఉపయోగబడతాయి.అందులోని ఒక స్లోకం మనం మన యొక్క రహస్యాలు ఆరుగురికి చెప్పకూడదు అని ఉంటుంది.ఆ ఆరుగురు ఎవరు, వారికి ఎందుకు రహస్యాలు చెప్పకూడదు అనే విషయాన్ని పండితులు క్షుణ్ణంగా వివరించారు.

ఇప్పుడు ఆ ఆరుగురు ఎవరు? వారికి ఎందుకు వివరించవద్దు అనే విషయాలు తెలుసుకుందాం

మూర్ఖుడు మరియు పిచ్చివాడు : మూర్ఖుడు లేదా పిచ్చివాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్థాడో అతడికే తెలియదు.అలాంటి వ్యక్తికి ఏదైనా రహస్యం చెబితే ఒకసారి కాకుంటే ఒకసారి అయినా అది బయటి వ్యక్తుల వద్ద చెప్పే ప్రమాదం ఉంది.పిచ్చి వారు కూడా రహస్యాలను ఎక్కువగా ఉంచుకోలేరు.అందుకే ఎలాంటి రహస్యమైనా మూర్ఖులకు మరియు పిచ్చివారికి చెప్పకుండా ఉండటం మంచిది

స్త్రీలు :

ఆడవారి నోట్ల మాట ఆగదు అంటూ అప్పట్లో వారికి శాపం తగిలింది.ఆడవారు ఏ విషయాన్ని అయినా ఎవరితోనో ఒకరితో చెప్పుకుని, వారి కడుపులో బారం తగ్గించుకోవాలి, లేదంటే వారికి కడుపులో బాధ అలాగే ఉంటూ ఉంటుంది.అందుకే ఏదైనా రహస్యం అనుకున్నప్పుడు ఆడవారికి మాత్రం అస్సలు చెప్పవద్దు.వారి నోట్లో ఏమాట ఆగదు.

చిన్న పిల్లలు :

అబం శుభం తెలియని చిన్న పిల్లలకు రహస్యాలు చెబితే వారికి తెలియకుండానే అవి వారి నుండి బయటకు వస్తాయి.అందుకే పిల్లల ముందు జాగ్రత్తగా మాట్లాడటంతో పాటు, జాగ్రత్తగా వ్యవహరించాలి.

అత్యాశపడేవారు మరియు దుర్మార్ఘుడు :

ఏదైనా రహస్యంను ఒక వ్యక్తికి చెప్పామే అనుకుంటే, ఆ వ్యక్తి అత్యాశ పరుడు అయితే ఖచ్చితంగా ఆ రహస్యం వల్ల అతడికి ఏదైనా కలిసి వస్తుంది అంటే రహస్యంను చెప్పే అవకాశం ఉంది.అందుకే అత్యాశ కలిగిన వ్యక్తికి రహస్యాలు చెప్పడం ఎప్పటికైనా ప్రమాదమే.

అందుకే ఈ ఆరుగురికి మీ యొక్క రహస్యాలు చెప్పకుండా ఉంటే మంచిది.ఈమద్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా పై ఆరు గుణాల్లో ఏదో ఒక గుణం కనిపిస్తూనే ఉంది.

అందుకే ఎవరి రహస్యాలు వారి వద్దే ఉంచుకుంటే మంచిదేమో కదా.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube