చీమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదవండి

క్రమశిక్షణ, ఐకమత్యం, కష్టం .ఇలాంటి పదాలు విన్నప్పుడు మనకు వెంటనే చీమలు గుర్తుకువస్తాయి.

 Amazing Facts About Ants-TeluguStop.com

ఎందుకంటే ఇవి కలసిమెలసి క్రమశిక్షణతో కష్టపడి పని చేస్తాయి.దాదాపు ప్రతీ ఇంట్లో కనబడే ఈ చీమల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివి తెలుసుకోండి.

* చీమలు కందిరీగల నుంచి పుట్టుకొచ్చాయి.దాదాపు 10 కోట్ల సంవత్సరాల కిందట ఇవి కందిరీగలతో విడిపోయి ప్రత్యేక జీవులుగా మారాయట.

* మనుషులకి ముందే వ్యవసాయం ఎలా చేయాలో చీమలకి తెలుసు.

* చీమల్లో 11,880 జాతులు ఉన్నాయట.

ప్రపంచంలోని చీమల బరువు మొత్తం కలిపితే, మనుషుల బరువు కన్నా ఎక్కువే ఉంటుందట.

* చీమలు తమ బరువు కన్నా 50 రేట్లు ఎక్కువ బరువున్న వస్తువులను మోయగలవు.

* చీమలది రసాయనిక భాష.ఏం చెప్పాలనుకున్నా, శరీరంలోంచి “పెరోమోన్స్” విడుదల చేసి చెబుతాయి అవి.

* చీమలను రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలుగా విభిజించవచ్చు.రెక్కలు ఉండే రాణి చీమ గుడ్లు పెట్టడంతప్ప మరేపని చేయదు.

రాణితో చీమతో కలిసాక మగ చీమలు చనిపోతాయి.

* ఒక్కో పుట్టలో 80 లక్షల చీమలు నివసించగలవు.

పుట్టను సైనిక చీమలు రక్షిస్తూ ఉంటాయి.ఇవి శతృ చీమల సైన్యంతో యుద్ధం కూడా చేస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube