వార్నీ..వెనిగ‌ర్‌ను ఇలా కూడా యూజ్ చేయొచ్చా?

వెనిగ‌ర్వంటకాల్లో ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తార‌ని అంద‌రికీ తెలుసు.అయితే వంట‌ల‌కు మాత్ర‌మే వెనిగ‌ర్ యూజ్ అవుతుంద‌ని అనుకుంటే పొర‌పాటే.

 Amazing Benefits Of Vinegar-TeluguStop.com

ఎందుకంటే, వెనిగ‌ర్‌ను వంటల్లోనే కాదు ఎన్నో విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా వెనిగ‌ర్ వ‌ల్ల ఏమేం ఉప‌యోగాలు ఉన్నాయో చూసేయండి.

సాధార‌ణంగా కొంద‌రి పాదాల నుంచి బ్యాడ్ స్మెల్ వ‌స్తుంటుంది.ముఖ్యంగా ప్ర‌స్తుత‌ వ‌ర్షా కాలంలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.అయితే ఒక బ‌కెట్ నీటిలో అర క‌ప్పు వెనిగ‌ర్ వేసి పాదాల‌ను పావు గంట పాటు ఆ నీటిలో ఉంచాలి.ఆ త‌ర్వాత మామూలు నీటితో పాదాల‌కు శుభ్రం చేసుకోవాలి.

 Amazing Benefits Of Vinegar-వార్నీ..వెనిగ‌ర్‌ను ఇలా కూడా యూజ్ చేయొచ్చా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా చేయ‌డంలో దుర్వాస‌న త‌గ్గ‌డ‌మే కాదు.ప‌గ్గులు కూడా పోయి పాదాల‌ను సున్నితంగా మార‌తాయి.

కోడి గుడ్ల‌ను ఉడికించేట‌ప్పుడు కొన్ని ప‌గిలిపోయి తెల్ల సోన బయటకు వ‌చ్చేస్తుంది.అలా రాకుండా ఉండాలీ అంటే గుడ్లు ఉడికించేటప్పుడు ఆ నీటిలో వెనిగర్ కలపండి.ఇలా చేస్తే తెల సోన బ‌య‌ట‌కు రాకుండా ఉంటుంది.మ‌రియు గుడ్లు త్వ‌ర‌గా ఉడుకుతాయి.

Telugu Benefits Of Vinegar, Good Health, Health, Health Tips, Latest News, Life Style, Vinegar, Vinegar Tips, Vinegar Uses-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే కూర‌ల్లో ఉప్పు లేదా కారం లేదా మ‌సాలాలు ఎక్కువైన‌ప్పుడు ఒక స్పూన్ వెనిగ‌ర్‌ను వేసి క‌లుపుకోవాలి.ఇలా చేస్తే కూర‌లో రుచి తటస్తం అవుతుంది.

కండ‌రాల నొప్పిని త‌గ్గించ‌డంలోనూ వెనిగ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక గిన్నెలో రెండు గ్లాసుల గోరు వెచ్చ‌ని నీటితో తీసుకుని అందులో ఒక స్పూన్ వెనిగ‌ర్ వేసి మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ నీటిలో ఒక కాట‌న్ క్లాత్‌ను ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో అద్దుకోవాలి.ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఒక్కోసారి బ‌ట్ట‌ల‌పై ప‌డిన మ‌ర‌క‌లు వ‌ద‌ల‌నే వ‌ద‌ల‌వు.అలాంట‌ప్పుడు మ‌ర‌క‌ల‌పై వెనిగ‌ర్‌ను పూసి.

ఆ త‌ర్వాత వాష్ చేయాలి.ఇలా చేస్తే ఎటువంటి మొండి మ‌ర‌క‌లైనా మ‌టుమాయం అవుతాయి.

#Tips #Vinegar Tips #Vinegar #Vinegar

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు