ఉప్పు తో బోలెడు లాభాలు..!!!  

  • మనం నిత్యం వంటింట్లో ఉప్పు ని ఎదో ఒక పదార్ధం లో ఉపయోగిస్తూనే ఉంటాం . ఉప్పు పదార్థాలకు రుచి ని ఇవ్వడమే కాకూండా మనకు ఎన్నో లాభాలని చేస్తుంది.

  • మనం వంట చేస్తున్నపుడు ఆహారం మాడిపోవడం వల్ల గిన్నెలు నల్లగా మారతాయి అలాంటపుడు ఆ గిన్నెలో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి మరిగించాలి. పదిహేను నిమిషాల తర్వాత నీళ్లు వంపి ఒకసారి కడిగితే చాలు.

  • వంటలకు మనం వెల్లుల్లి ఉపయోగిస్తాం అలాంటి వెల్లుల్లి పొత్తు తీసినప్పుడు చేతులు వాసన వస్తాయి. ఆ వాసన పోవాలంటే నిమ్మరసం లో ఉప్పు వేసి చేతులు కడుగుకుంటే ఫలితం ఉంటుంది.

  • పాదాలు మంట గా అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా కలిపి అందులో కాళ్ళను ఉంచాలి. తక్షణమే ఉపశమనం కలుగుతుంది.

  • ఆపిల్ ముక్కలు నల్ల గా మారకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో ఉంచాలి.

  • దుస్తుల మీద చెమట, వైన్ మరకలు పోవాలంటే వేణ్ణీళ్ళల్లో ఉప్పు వేసి దూది ని ముంచి మారకాల మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

  • కళ్ళు అలసటగా అనిపిస్తే వేడి నీటిలో 1/2 స్పూన్ ఉప్పు వేసి ఆ నీటితో కళ్ళు కడిగితే అలసట మాయమైపోతుంది