ముఖ సౌంద‌ర్యానికి గుమ్మడికాయ..ఇలా వాడితే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

Amazing Benefits Of Pumpkin For Skin

ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే కాయ‌కూర‌ల్లో గుమ్మడికాయ ఒక‌టి.గుమ్మ‌డిలో ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలే కాదు, అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించే ఔష‌ధ గుణాలూ నిండి ఉంటాయి.

 Amazing Benefits Of Pumpkin For Skin-TeluguStop.com

అందుకే వారానికి ఒక సారైనా గుమ్మ‌డి కాయ‌ను తినాల‌ని నిపుణులు చెబుతుంటారు.అలాగే ముఖ సౌంద‌ర్యానికి సైతం గుమ్మ‌డి కాయ ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌రి లేటెందుకు గుమ్మ‌డికాయను చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలి.? అస‌లు గుమ్మ‌డి వ‌ల్ల ఏయే ప్ర‌యోజ‌నాలు చ‌ర్మానికి అందుతాయి.? వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.

 Amazing Benefits Of Pumpkin For Skin-ముఖ సౌంద‌ర్యానికి గుమ్మడికాయ..ఇలా వాడితే ఆ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్ర‌స్తుతం వింట‌ర్ సీజ‌న్ కావ‌డం వ‌ల్ల దాదాపు చాలా మంది పొడి చ‌ర్మంతోనే ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.

అయితే  కొన్ని గుమ్మ‌డి కాయ ముక్క‌ల‌ను వాట‌ర్ సాయంతో మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నెలో రెండు స్పూన్ల గుమ్మ‌డికాయ పేస్ట్, ఒక స్పూన్ తేనె, రెండు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసి.

ముఖానికి, మెడ‌కు ప‌ట్టించాలి.ఆరిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకుంటే.పొడి చ‌ర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.

Telugu Tips, Latest, Pumpkin, Pumpkin Face, Pumpkin Skin, Skin Care, Skin Care Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

అలాగే మొటిమ‌లు, న‌ల్లటి  మ‌చ్చ‌ల‌తో బాధ ప‌డే వారికీ గుమ్మ‌డి హెల్ప్ చేస్తుంది.ఒక బౌల్‌లో రెండు స్పూన్ల గుమ్మ‌డికాయ పేస్ట్‌, అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాలు ప్ర‌భావిత ప్రాంతంలో అప్లై చేసి.

ప‌ది నిమిషాల త‌ర్వాత వాట‌ర్‌తో శుభ్ర‌ప‌రుచుకోవాలి.ఇలా రోజూ చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు ప‌రార్ అవుతాయి.

Telugu Tips, Latest, Pumpkin, Pumpkin Face, Pumpkin Skin, Skin Care, Skin Care Tips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇక స్కిన్ టోన్‌ను పెంచుకోవాల‌ని కోరుకునే వారు.ఒక స్పూన్ గుమ్మ‌డికాయ పేస్ట్‌కు, ఒక స్పూన్‌ బొప్పాయి పండు పేస్ట్‌, ఒక స్పూన్ పాలు క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.పావు గంట పాటు ఆర‌నిచ్చి.ఆపై గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేస్తే చ‌ర్మం తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.

#Pumpkin #Pumpkin #Care Tips #Tips #Pumpkin

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube