తాటి ముంజలు శరీరానికి ఎంత మేలు చేస్తాయో చూడండి  

Amazing Benefits Of Ice Apple Or Munjalu-

English Summary:Provided that the nature of this gift is like a palm galingale endakalanlo. Munjal is referred to as simple as that.Apple is known as ice in English. Palletullaki summer holidays to go, but we are going to be at dorikentanga are available.City will also sell ..The rate will not be too much. But the city crowds, and think a little bit to eat.And because of its background. It is the tree growing.Aharapadartham but it is completely healthy. If you can not eat the profits.It must have been in your diet, especially in the summer. See for yourself why.* 7 munjalo vitamin B, folate, vitamin K, solebul fiber, potassium, calcium, vitamin A, vitamin C, vitamin B, zinc, iron, vitamins and the like are nyutrints. * Munjalo water content is too high.Just Watermelon tinagane you would hydrate, hydrate, as well as be tinagane Munjal. Take it when thirsty.

ఈ ఎండకాలంలో ప్రకృతి మనకు అందించిన వరం లాంటిది తాటి ముంజ. సింపుల్ గా వీటినే ముంజలు అని అంటారు. ఆంగ్లంలో ఐస్ ఆపిల్ అని అంటారు..

తాటి ముంజలు శరీరానికి ఎంత మేలు చేస్తాయో చూడండి -

వేసవి సెలవులకి పల్లెటూళ్ళకి వెళ్ళాలి కాని, ఇవి మనం వద్దు అన్న దొరికేంతంగా అందుబాటులో ఉంటాయి. సిటిల్లో కూడా అమ్మడానికి వస్తారు . రేటు కూడా పెద్దగా ఉండదు. కాని సిటిల్లో జనాలే, ఇవి తినడానికి కొద్దిగా ఆలోచిస్తారు. అందుకు కారణం దీని బ్యాక్ గ్రౌండ్.

ఇది పెరిగే చెట్టు. కాని ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన ఆహారపదార్థం. దీని లాభాలు తెలిస్తే తినకుండా ఉండలేరు.

ముఖ్యంగా వేసవిలో ఇది మీ డైట్ లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో మీరే చూడండి.* ముంజలో విటమిన్ బి7, ఫోలేట్, విటమిన్ కె, సోలేబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, జింక్, ఐరన్ లాంటి విటమిన్స్ మరియు న్యూట్రింట్స్ ఉంటాయి.* ముంజలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది.

ఎలాగైతే మీరు పుచ్చకాయ తినగానే హైడ్రేట్ అవుతారో, అలాగే ముంజలు తినగానే హైడ్రేట్ అవుతారు. దాహం వేసినప్పుడు దీన్ని తీసుకోవాలి. ఎలాగైతే ఏంటి .

మనకి కావాల్సింది వాటర్ కదా. ముఖ్యంగా చాలావరకు పల్లెటూరిలో పుచ్చకాయ సరిగా అందుబాటులో ఉండదు కాని ముంజ మాత్రం బాగా దొరుకుతుంది.

అలాంటప్పుడు ముంజ పుచ్చకాయలా పనిచేస్తుంది.* సమ్మర్ లో ఈజీగా ఆలసిపోతాడు మనిషి. ఎందుకంటే ఎండ మనలో ఉన్న శక్తినంతా పీల్చేసుకుంటుంది.

చమట బాగా రావడంతో మనిషికి అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు తక్షణ శక్తి కోసం ముంజ తినవచ్చు.* ఎండలో తలనొప్పి కామన్.

ఆ తలనొప్పి వలన ఒక్కోసారి వంతులు అవుతుంటాయి. వేసవిలో తలతిప్పడం, వాంతులు అవడం మనం సాధారణంగా చూసేది. ఈ సీజనల్ సమస్యలకి మంచి పరిష్కారం ముంజలు తినడం.

అలాగే టెంపరేచర్ తట్టుకోలేకపోవడం, చికెన్ పాక్స్ లాంటి చర్మ సమస్యలకి కూడా ఇదో పరిష్కార మార్గం.* బరువు తగ్గాలనుకునేవారు కూడా ముంజని తమ డైట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ.

కడుపు నిండినట్టుగానే అనిపిస్తూ, ఎక్కువ తినాలి అనిపించదు. దాంతో అనవసరపు కాలరీలు మీ ఒంట్లోకి చేరవు.* ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ వలన ఇది ఒంట్లోంచి టాక్సిన్స్ ని తొలగిస్తుంది.

అంటే ఇది లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది అంట. అంతేకాదు … ఇది జీర్ణశక్తిని పెంచే ఆహారం. ముఖ్యంగా గర్భిణిస్త్రీలు తమ మెటబాలిజం రేట్ ని బాగా మెయింటేన్ చేయడం కోసం ముంజలు తినాలి.