చింతపండు తినడం వలన ఎన్ని లాభాలో  

Amazing Benefits Of Eating Tamarind-

చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంతలేదన్న 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం కొన్ని వంటకాల్లో వాడుకుంటాం. చింతపండుతో పచ్చడి కూడా చేసుకుంటాం...

చింతపండు తినడం వలన ఎన్ని లాభాలో -

కాని మనకు చింతపండులో కూరల్లో వాడటం వరకే తెలుసు. అది మన శరీరానికి అందించే లాభాలు తెలుసుకుంటే వీలు చిక్కినప్పుడల్లా కొంత చితపండు నోట్లో వేసుకోవడం మొదలుపెడతారు. * చింతపండులో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, పొటాషియం, డైటరి ఫైబర్, మాన్గానీజ్ తదితర విటమిన్స్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

* చింతపండులో డైటరి ఫైబర్ బాగా ఉండటం వలన ఇది బ్యాడ్ కొలెస్టరాల్ లెవల్స్ ని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది ధమనులు మరియు సిరలలో చిక్కుకున్న కొలెస్టరాల్ ని బయటకి తోస్తుంది.* దీంట్లో పొటాషియం పాళ్ళు కూడా ఎక్కువే.

దాంతో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇటు ఫైబర్ వలన కొలెస్టరాల్ లవల్స్ కంట్రోల్ లోకి వచ్చి, అటు పొటాషియం వలన బ్లడ్ ప్రషర్ ట్రాక్ లో పడితే గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే.

మనం ఎక్కువ తెల్లబియ్యం తింటాం. కార్బోహైడ్రేట్స్ మరీ ఎక్కువ తీసుకుంటాం. దాంతో సునాయాసంగా బరువు పెరుగుతాం, కొవ్వు పెరుగుతుంది, వీటితో పాటే డయాబెటిస్ సమస్య కూడా ఉంటుంది.

ఇవన్ని కంట్రోల్ లో ఉండాలంటే చింతపండు తింటూ ఉండాలి.* విటమిన్ సి ఎక్కడుంటే అక్కడ రోగనిరోధకశక్తి ఉంటుంది. చితంపండు అంటే విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్ యోక్క కలబోత.

ఇది రోగనిరోధకశక్తిని చాలా త్వరగా పెంచుతుంది. కాబట్టి కూరల్లో చింతకాయం వాడటం అలవాటు చేసుకోండి.* చింతపండులో డైటరి ఫైబర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా.

ఫైబర్ మన కడుపుకి ఎంత మంచిదో ఇప్పటికే చాలాసార్లు చదువుకున్నాం కదా. ఫైబర్ ఉండే మిగితా ఆహారపదార్థాల లాగే చింతపండు కూడా అజీర్ణం, మలబద్ధకం లాంటి సమస్యలపై ప్రభావం చూపిస్తుంది.* తియమేయిన్, విటమిన్ బి కాంప్లెక్స్ ఉండటం వలన చింతపండు బలాన్ని ఇస్తుంది.

నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. నరాల బలహీనత ఉన్నవారు, కండలు పెంచాలి అనుకునేవారు చింతపండు మీద కొంచెం మనసు పెట్టాలి.