ఎండిన కొబ్బరితో దొరికే అధ్బుతమైన లాభాలు  

Amazing Benefits Of Dry Coconut-

  • కొబ్బరి ఎంత ఆరోగ్యకరమైనదో మనకి తెలిసిన విషయమే. కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

  • ఎండిన కొబ్బరితో దొరికే అధ్బుతమైన లాభాలు -

  • కాని మామూలు కొబ్బరి కాదు, ఎండిన కొబ్బరి వలన దొరికే లాభాలు ఏంటో తెలుసా ? అసలు ఎండిన కొబ్బరి ఏంటి ? కొబ్బరినీటి తడి, లేదా మాయిశ్చర్ లేని కొబ్బరి. మరి కొబ్బరి నీళ్ళలో ఉండే అద్భుతాలని పొందలేనప్పుడు మామూలు కొబ్బరి ఎంతవరకు పనిచేస్తుంది ? మనకు ఎలా పనికివస్తుంది ?

    ఎండిన కొబ్బరి ఊరికే ఖాలిగా ఉండదు కదా.

  • అది ఎండినా, దాంట్లో కాపర్, ఫైబర్, సేలేనియం ఉంటాయి. పైగా ఇందులో ట్రాన్స్ ఫాట్స్ ఉండవు.

  • కాబట్టి కొబ్బరి ఎండినంత మాత్రానా దానివలన అది న్యూట్రిషన్ వాల్యూ కోల్పోతుందేమో అని అనుకోవద్దు. దాని వలన ఎన్నో లాభాలు ఉంటాయి.

  • * ఎండిన కొబ్బరిలో సేలేనియం ఉంటుందని ఇప్పటికే చెప్పాం కదా. ఈ సేలేనియం సేలేనోప్రోటీన్స్ శరీరంలో విడుదల చేస్తుంది.

  • ఇది ఎన్నో రోగాలను నయం చేస్తుంది. కాబట్టి ఎండిన కొబ్బరి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుందని చెప్పుకోవచ్చు.

  • ఇది ఇమ్యునిటి సిస్టమ్ కి బాగా ఉపయోగపడే ఆహారమని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

    * రక్తహీనత సమస్య చాలామందికి ఉంటుంది.

  • అందులోనూ ఇది స్త్రీలలో ఎక్కువ. ఎందుకంటే వారి శరీర నిర్మాణం అలాంటిది.

  • పీరియడ్స్ లో చాలా రక్తాన్ని కోల్పోతారు. అందుకే స్త్రీలకి రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.

  • ఎండిన కొబ్బరిలో మంచి ఐరన్ గణాలు ఉండటంతో ఇది రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.

    * మతిమరుపు కూడా ఓ కామన్ సమస్య అయిపొయింది ఈ కాలంలో.

  • నిన్న ఓ వస్తువు ఎక్కడో పెడితే, ఈరోజు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాదు. ఎండిన కొబ్బరి రెగ్యులర్ గా తినాలే కాని ఇది మెదడు పనితనాన్ని మెరుగుపరుస్తుంది.

  • దీంట్లో ఉన్న న్యూట్రిషన్ బ్యాలెన్స్ అలాంటిది.

    * సేలేనియం ఇటు రోగనిరోధకశక్తిని పెంచుతూ రోగాలతో పోరాడుతూనే, పురుషుల ఫర్టిలిటి అంటే, పిల్లల్ని కనే సామార్ధ్యాన్ని వీర్యంలో పెంచుతుంది.

  • ఇది నిజంగానే నిజం. ఎండిన కొబ్బరి వీర్యకణాల కౌంట్ ని పెంచుతుంది.

  • * ఇది అతి పెద్ద లాభం. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది.

  • పురుషుడికి రోజుకి 38గ్రాముల డైటరి ఫైబర్ అవసరం, అలాగే మహిళలకి 25 గ్రాములు అవసరం. ఈ అవసరాన్ని ఎండిన కొబ్బరి తీర్చి గుండె సంబంధిత వ్యాధులను దూరం పెడుతుంది.

    * జీర్ణ సమస్యలు, కీళ్ళ నొప్పుల సమస్యలను కూడా అడ్డుకుంటుంది ఎండిన కొబ్బరి.

  • ఇది ప్రోస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ సెల్స్ పెరక్కుండా అడ్డుకుంటుంది కూడా.