గంజి రుచి ఎలా ఉంటుందో కూడా ఈ కాలం పిల్లలకి తెలియదు.అలా పెంచడం తప్పు అని కాదు.
ఎందుకంటే గంజినీళ్ళు అంటే ఓ చులకన భావం ఉంటుంది.అదీకాక గంజినీళ్ళు ఆరోగ్యానికి చేసే మేలు కూడా మనలో చాలామందికి తెలియదు కదా.అలాంటివారు ఇది చదవండి.* Diarrohea తో పసిపిల్లలు ఇబ్బందిపడటం చూస్తుంటాం మనం.ఈ సమస్య వలన త్వరగా డీహైడ్రేట్ అయిపోయి ఏడుస్తుంటారు పసిపిల్లలు.పిల్లలే కాదు, పెద్దవారు కూడా ఈ సమస్యతో బాధపడితే, గంజినీళ్ళతో ఉపశమనం పొందవచ్చు.* జ్వరంతో ఇబ్బందిపడుతున్న సమయంలో, గంజినీళ్ళు రికవరీ కోసం ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.గంజి న్యూట్రింట్స్ ని అందించి, వాటర్ లాస్ ని తగ్గిస్తుంది.* ఫైబర్ కలిగి ఉండటం వలన, గంజి మలబద్ధకం పైన కూడా పనిచేస్తుంది.వైరల్ ఇంఫెక్షన్స్ ఉన్నసరే, గంజితో ఉపయోగమే ఉంటుంది.* మొటిమలను గంజి దూరం చేస్తుందని డెర్మాటాలాజిస్టులు చెబుతారు.ఇది కోమలమైన చర్మాన్ని కూడా అందిస్తుందట.* ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ ఉండటం వలన, గంజి కురుల ఆరోగ్యానికి పనికివస్తుంది.జుట్టుకి బలాన్ని, అందాన్ని చేకూరుస్తుంది.