కాఫీ గింజలతో ఉపయోగాలు తెలిస్తే....షాక్ అవ్వాల్సిందే  

  • ఉదయం లేవగానే కాఫీ త్రాగందే ఏ పని చేయాలనీ అనిపించదు. అలసట,బడలిక ఉన్న సమయంలో కూడా కాఫీ త్రాగుతూ ఉంటాం. కాఫీ అలసటను దూరం చేయటానికే కాకుండా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలపై ఒక లుక్ వేద్దాం.

  • కాఫీ పొడితో నలుగు పిండి తయారుచేసుకోవచ్చు. ఆశ్చర్యం కలుగుతుంది కదా ! అయితే ఇది నిజం. కాఫీ పొడిలో కొంచెం కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన ముఖం మృదువుగా మారటమే కాకుండా కాంతివంతంగా మారుతుంది.

  • కాఫీ డికాషన్ ని తలకు పట్టించి తలస్నానము చేస్తే జుట్టు పట్టుకుచ్చు లా ఉంటుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

  • కాఫీకి దుర్వాసనలను తొలగించే లక్షణం కూడా ఉంది. కారు,గదులు,ఫ్రిడ్జ్ ల నుండి దుర్వాసన వస్తుంటే….ఒక కప్పులో కాఫీ గింజలు వేసి ఉంచితే దుర్వాసన ఇట్టే మాయం అవుతుంది.

  • చేతుల నుంచి వెల్లుల్లి,ఉల్లిపాయ వాసన ఒక పట్టాన పోవు. అలాంటప్పుడు కొంచెం కాఫీ పొడిని చేతులకు రాసుకొని శుభ్రం చేసుకుంటే వాసన పోతుంది.

  • కొన్ని పాత్రలకు జిడ్డు,మురికి తొందరగా వదలవు. అప్పుడు కొంచెం కాఫీ పొడితో శుభ్రం చేస్తే సులువుగా జిడ్డు,మురికి తొలగిపోతాయి.

  • పిల్లలు వాడే షూ దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోవాలంటే కొంచెం కాఫీ పొడి చల్లితే కొంచెం సేపటికి దుర్వాసన పోతుంది.