కాకరకాయ చేదైనా.. ఔషధ గుణాలు పుష్కలం  

Amazing Benefits Of Bitter Gourd-

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. అయితే కాకరకాయలఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు గురించి తెలుసుకుంటే తప్పనిసరిగకాకరకాయను తినటం అలవాటు చేసుకుంటారు..

కాకరకాయ చేదైనా.. ఔషధ గుణాలు పుష్కలం-

ఇప్పుడు కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలఅవి మన ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ లెవల్స్ ని బేలన్స్ చేయగల సామర్ధ్యం కాకరకాయకు ఉంది. అలాగకాకరకాయ జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆకలిని పెంచి కడుపునొప్పినతగ్గిస్తుంది. నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుందిశరీరంలో ఉన్న అధిక కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.కాకరకాయలో విటమిన్‌-ఎ రిబోప్లావిన్‌ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలరాకుండా కాపాడుతుంది.

అంతేకాక కాకరకాయలో మలబద్దకాన్ని నివారించే ప్రత్యేలక్షణాలు ఉన్నాయి. కాకరకాయను వీలైనంత ఎక్కువగా అంటే రోజు విడిచి రోజఆహారంలో తింటుంటే రక్తప్రసరణ చక్కగా జరిగి, తద్వారా కొవ్వు కరిగి శరీరనాజూకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాకర కాయ వలన బిపి కూడా కంట్రోల్ లఉంటుంది.

వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే ఆకలపెరిగి, అజీర్ణం తగ్గతుంది.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయననిదానంగా తినటం అలవాటు చేసుకోండి.