సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి  

Amazing Benefits Human Body Gets From Sapota-

English Summary:Sapotas found in one of the fruits of our backyards. It is also known as ciku.Energetic sapotas fruit quickly. It is because a good amount of phraktos available.Yantiaksidents even more. Let's see if it can be very easy and useful for our body sapotas ennorakaluga!
* One sapotalo 141 kalarilu, 33 carbohydrates.93 grams, 0.75 grams protinlu, fiber 9.Is 01 grams.
* Of the potassium, seleniyam, magnesium, iron, calcium, sodium, zinc minerals are like.
* As well as vitamin A, C, B-6, folic acid, vitamin K, vitamin B 12 are available. Moreover, the amino acids needed to pee also owns sapotas.
* Vitamin A kanticupuki sapotalo good. Vitamin C increases the immunity.Calcium increases bone strength.
* Provides sapotas taksanasaktini.Levels in the phraktos, proteins that cause the power. Anipipincina exhaustion, a three to four sapotas no good for eating.

మన పెరట్లో కనిపించే ఫలాల్లో సపోటా ఒకటి. దీన్ని చికూ అని కూడా అంటారు. సపోటా త్వరగా శక్తినిచ్చే ఫలం..

సపోటా తింటూ ఉండాలి .. ఎందుకో తెలుసుకోండి-

ఎందుకంటే దీంట్లో ఫ్రక్టోస్ మంచి మోతాదులో దొరుకుతుంది. యాంటిఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. మరి చాలా సులువుగా దొరుకే సపోటా ఎన్నోరకాలుగా మన శరీరానికి ఉపయోగపడుతుందో చూద్దామా!

* ఒక్క సపోటాలో 141 కాలారీలు, పిండిపదార్ధము 33.93 గ్రాములు, ప్రోటిన్లు 0.75 గ్రాములు, ఫైబర్ 9.01 గ్రాములు ఉంటుంది.

* దీంట్లో పొటాషియం, సెలెనియం, మెగ్నీషియమ్, ఐరన్, కాల్షియం, సోడియం, జింక్ లాంటి మినరల్స్ దొరుకుతాయి.

* అలాగే విటమిన్ ఏ,సి, బి6, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ కే, ,విటమిన్ బి12 లభిస్తాయి. అంతేకాదు, ఒంటికి అవసరమైన అమినో ఆసిడ్స్ కూడా సపోటా సొంతం.

* సపోటాలో ఉండే విటమిన్ ఏ కంటిచూపుకి మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది.

* సపోటా తక్షణశక్తిని అందిస్తుంది. ఇందులో ఉండే ఫ్రక్టోస్ లెవెల్స్, ప్రోటీన్‌లు ఆ శక్తికి కారణం.

ఏమాత్రం అలసటగా అనిపిపించినా ఓ మూడు నాలుగు సపోటాలను తినడం మంచిది.

* తెనేతో పాటు సపోటాను సేవిస్తే శృంగార సమస్యలను దూరం పెట్టవచ్చును. శీఘ్రస్కలన సమస్యలకు, శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి సపోటా, తేనేల కలయిక ఉపయోగకరం.

* రక్తహీనతతో బాధపడేవారు కూడా సపోటాను తింటూ ఉండాలి. అయితే, షుగర్ లెవెల్స్ తో బాధపడేవారు మాత్రం కాస్త ఆలోచించి తినాలి. డాక్టర్ ని సంప్రదించి ఎంత తినాలో తెలుసుకుంటే మంచిది.

* ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వలన ఇది జీర్ణక్రియను క్రమబద్ధంగా ఉంచుతుంది. అంతేకాదు, ఇందులో యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియా లక్షణాలు కూడా ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటా తినిపిస్తూ ఉండటం మంచిది.