అరటిపండు తొక్కతో ఇన్ని లాభాలా !

అరటిపండు చాలా ఆరోగ్యకరమైన ఫలం.పైగా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

 Benefits Of Banana Peel-TeluguStop.com

అందుకేనేమో పెద్దగా పట్టించుకోరు.ఇక అరటిపండు తొక్కనైతే అసలే పట్టించుకోరు.

ఇలా తినగానే అలా పడేస్తారు.కాని అరటితొక్కతో ఎన్నో లాభాలు ఉన్నాయి.

ఖర్చులు పెద్దగా పెట్టకుండా, ఎన్నోరకాలుగా వాడుకోవచ్చు అరటితోక్కని.వాటిలో కొన్ని లాభాలు ఇప్పుడు చూద్దాం.

* దంతాలు పచ్చగా ఉంటే , రోజూ అరటిరోక్కతో రుద్దుతూ ఉండండి.మంచి ఫలితాలు కనిపిస్తాయి.

* ముఖం మీద వచ్చే ముడతలు, కళ్ళ కింద ఏర్పడే వలయాలు పోగొట్టుకోవాలంటే అరటితొక్క మంచి మార్గం.

* జిడ్డు చర్మానికి అరటితొక్క మంచి ఉపశమనం.

రోజు అరటితోక్కను ముఖానికి రుద్దుకోవడం అలవాటు చేసుకోండి.అరటితొక్క జిడ్డుని బాగా తొలగిస్తుంది.

* మొటిమలకు అరటితొక్క పెద్ద శత్రువు.తొక్కే కదా అని తీసిపారేయకండి.

అరటితొక్క అంటే భయపడతాయి మొటిమలు.

* అరటితొక్క వాడితే , ఏ ఫేర్ నెస్ క్రీమ్ వాడాల్సిన అవసరం లేదు.

ముఖం రంగు తేలాలంటే, అరటితొక్క వాడకం సహజమైన ఉపాయం .

* చెప్పులు, షూలను పాలిష్ చేసుకోవడానికి కూడా అరటితోక్కను వాడుకోవచ్చు.

* గాయం తగిలిన చోట అరటితొక్క రాస్తే, నొప్పి చాలావరకు తగ్గుతుంది.

ఇదంతా చదివారు కాబట్టి, అరటిపండు తిని, అరటితోక్కను కూడా వాడుకున్నాకే చెత్తబుట్టలో పడేయ్యండి .

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు