ముఖం మీద మలినాలను తొలగించటానికి... సముద్ర ఉప్పు

ముఖం మీద మలినాలు,దుమ్ము,ధూళి తొలగించటానికి సముద్ర ఉప్పు అద్భుతంగా పనిచేస్తుంది.ముఖం మీద మలినాలను తొలగించటానికి బయట మార్కెట్ లో దొరికే క్రీమ్స్,లోషన్స్ ఉపయోగించటానికి బదులు సముద్ర ఉప్పును ఉపయోగిస్తే అద్భుతాన్ని చూడవచ్చు.

 Amazing Beauty Benefits Of Sea Salt , Sea Salt, Vitamin E Capsule, Honey, Almond-TeluguStop.com

సముద్ర ఉప్పు అన్ని సూపర్ మార్కెట్ లలోను దొరుకుతుంది.అయితే సముద్ర ఉప్పును ఎలా వాడితే మలినాలు తొలగిపోతాయో చూద్దాం.

ఒక గ్లాస్ నీటిలో అరస్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలిపి ముఖాన్ని కడిగి పది నిముషాలు అలానే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఒక విటమిన్ E క్యాప్సిల్ ఆయిల్ లో చిటికెడు సముద్ర ఉప్పు వేసి బాగా కలిపి ముఖానికి రాసి సున్నితంగా 5 నిముషాలు మసాజ్ చేయాలి.

పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రెండు స్పూన్ల తేనెలో అరస్పూన్ సముద్ర ఉప్పు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంపై మలినాలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.

ఒక స్పూన్ బాదం నూనెలో అరస్పూన్ ఓట్ మీల్ పొడి,చిటికెడు సముద్ర ఉప్పు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా బయటకు వెళ్లి వచ్చినప్పుడు చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube