జూన్ 23 నుంచి అమర్ నాథ్ యాత్ర... ప్రకటించిన షైన్ బోర్డు

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రాలలో అమర్ నాథ్ కూడా ఒకటి.సంవత్సరం లో కేవలం కొన్ని నెలలు మాత్రమే అమర్ నాథ్ లో దర్శనాలు జరుగుతాయి.

 Amarnath Yatra 2020 To Commence From June 23, Lock Down, Spiritual Tours, Corona-TeluguStop.com

కేవలం కొన్ని నెలలు మాత్రమే అమర్ నాథ్ లో మంచు శివలింగం దర్శనం ఇస్తుంది.ఈ నేపధ్యంలో మూడు నెలల కాలం మాత్రమే ఇక్కడ శివుడికి పూజలు, దర్శనాలు జరుగుతాయి.

అయితే ప్రస్తుతం లాక్ కారణంగా దేశంలోని అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనాలు నిలిచిపోయాయి.నిత్య దీపారాధన మాత్రమే జరుగుతుంది.

మిగిలిన అన్ని దైవ సంబంధ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి.దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడో వందల ఏళ్ల క్రితం వచ్చింది.

మరల ఇప్పుడు అదే పరిస్థితి నెలకొని ఉంది.

ఇక కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ దేవాలయాలు దర్శనాలకి అనుమతి ఇస్తే వైరస్ మరింత విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

అయితే ఈ ప్రభావం అమర్ నాథ్ యాత్రపై కూడా ఉంటుందనే అనుమానాలు ఇన్ని రోజులు తలెత్తాయి.వీటిపై క్లారిటీ ఇస్తూ ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 23 నుంచి ఆగస్టు 3 వరకు సాగుతుందని అమర్‌నాథ్‌ షైన్‌బోర్డు మార్చిలో ప్రకటించింది.

ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్‌ 1 నుంచి మే 31 వరకు చేసుకోచ్చునని కూడా చెప్పింది.ఇప్పుడున్న కరోనా స్థితి నుంచి పూర్తిగా బయట పడితే అమర్ నాథ్ యాత్ర అయిన కొనసాగే అవకాశం ఉంది.

లేదంటే ఈ ఏడాదికి ఇది కూడా ఉండకపోవచ్చనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube