పంజాబీ సీసీ చీఫ్ సిద్దు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న అమరేందర్ సింగ్ వర్గం..!!

త్వరలో పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం దిశగా వెళుతున్న తరుణంలో ముఖ్యంగా సిద్దూకి అదే రీతిలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత సీఎం అమరేందర్ సింగ్ మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో ఇద్దరిని ఢిల్లీకి పిలిపించుకుని వేరువేరుగా వారితో కాంగ్రెస్ పెద్దలు మాట్లాడటం జరిగింది.

 Amarinder Singh Faction Says Punjabi Cc Chief Sidhu Should Apologize-TeluguStop.com

అయితే ఈ సమావేశం అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే పంజాబ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ పదవిని సిద్దూకి కేటాయించడంతో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ లో సరికొత్త వాతావరణం నెలకొంది.

పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు గత కొద్ది రోజుల నుండి వరుసగా పీసీసీ చీఫ్ పదవి అందుకున్న సిద్దూనీ కలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 Amarinder Singh Faction Says Punjabi Cc Chief Sidhu Should Apologize-పంజాబీ పిసీసీ చీఫ్ సిద్దు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న అమరేందర్ సింగ్ వర్గం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే సీఎం అమరేందర్ సింగ్.మాత్రం సిద్ధూ తనకు క్షమాపణ చెప్పే వరకు కలిసే ప్రసక్తి లేదని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సీఎం అమరేందర్ సింగ్ వర్గం కి చెందిన నాయకులు గతంలో సిద్ధూ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్లకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.అంతమాత్రమే కాకుండా సిద్ధూ నిర్వహించే సమావేశాలకు అమరేందర్ సింగ్ వర్గానికి చెందిన నాయకులు డుమ్మా కొడుతూ ఎవరికివారు అన్న తరహాలో పంజాబ్ కాంగ్రెస్లో వ్యవహరిస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కి మళ్లీ తలనొప్పి స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

#Amarinder Singh #Panjab #Congress #Sidhu #AmarinderSingh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు