కాబోయే కోడలి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమర్ దీప్ తల్లి?

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ఈ సీరియల్ తో ఎంతో ఫేమ్ అయినటువంటి అమర్ వరుస బుల్లితెర కార్యక్రమాలలో కూడా తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.

 Amardeeps Mother Made Shocking Comments About Future Daughter In Law , Amardeep-TeluguStop.com

అయితే ఇలా పలు కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయన తాజాగా నిశ్చితార్థం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.బెంగళూరులో అమర్ మరొక బుల్లితెర నటి తేజస్వినితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.

ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు.రహస్యంగా వీరిద్దరూ ప్రేమయానం చేసి ఎంగేజ్మెంట్ తో ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇకపోతే తాజాగా ఈ ఎంగేజ్మెంట్ కోసం జానకి కలగనలేదు సీరియల్ టీం వెళ్లారు.ఇకపోతే మల్లికా(విష్ణు ప్రియ) తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఒక వ్లాగ్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అమర్ తన ప్రేమ విషయాన్ని ముందుగా తనతోనే చెప్పారని అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి కూడా ఒక కారణం ఉందని తెలిపారు.

Telugu Amardeep, Tejaswini, Viu Priya-Movie

ఇలా తనని అమర్ అక్క అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తారని ఒక ఆడపడుచుగా తాను బాధ్యత తీసుకొని అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేస్తున్నానని తెలిపారు.విష్ణు ప్రియతో పాటు ఈ సీరియల్ జానకి పాత్రలో నటించిన ప్రియాంక ఇద్దరు ఒక గదిలో తయారవుతుండగా అక్కడికి అమర్ దీప్ తల్లి రావడంతో తనని విష్ణు ప్రియ పరిచయం చేశారు.ఈ సందర్భంగా కాబోయే కోడలు గురించి మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నాకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అనుకున్నానో తను అలాగే ఉందని తెలిపారు.

ఎంతో అందమైన కోడలు మంచి సింగర్, క్లాసికల్ డాన్సర్,మా క్లాసికల్ ఫ్యామిలీకి క్లాసికల్ డాన్సర్ కోడలుగా రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇలా కాబోయే కోడలు గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube