నెగటివ్ కామెంట్స్ పై ఫైర్ అయిన తేజస్విని, అమర్ దీప్.. మీకు అక్కా చెల్లెళ్లు లేరా అంటూ?

తెలుగు బుల్లితెర నటీనటులు అయిన తేజస్విని గౌడ, అమర్ దీప్ చౌదరి లు ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంట నిశ్చితార్థం అభిమానులకు బుల్లితెర పేక్షకులు ఒక్కసారిగా షాకింగ్ గురి చేసింది.

 Amardeep Chaudhary Fiance Tejaswini Gowda Gets Emotional Over Negative Comments , Amar Deep, Janaki Kalaganaledu, Tejaswini Gowda, Emotional, Negative Comments-TeluguStop.com

ఎందుకంటే ఈ జంట లవ్ లో ఉన్నట్లుకానీ, పెళ్లి చేసుకోబోతున్నట్లు కానీ ఎటువంటి వార్తలు వినిపించలేదు.కానీ ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇకపోతే తేజస్విని కోయిలమ్మ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పలు సీరియల్స్ నటిస్తున్న విషయం తెలిసిందే.అలాగే ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న అమర్ దీప్ అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే.

 Amardeep Chaudhary Fiance Tejaswini Gowda Gets Emotional Over Negative Comments , Amar Deep, Janaki Kalaganaledu, Tejaswini Gowda, Emotional, Negative Comments -నెగటివ్ కామెంట్స్ పై ఫైర్ అయిన తేజస్విని, అమర్ దీప్.. మీకు అక్కా చెల్లెళ్లు లేరా అంటూ-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఈ కొత్త జంటను ఎవరు టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారో కానీ ఈ కొత్త జంట ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే మీకు అమ్మ,అక్క, చెల్లి లేరా అంటూ లైవ్ లోకి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది తేజస్విని గౌడ.వారిపై చాలామంది నెగటివ్ గా కామెంట్ చేస్తున్నారని, ఆ కామెంట్స్ వారు పట్టించుకోలేదట.కానీ ఆ కామెంట్స్ చదవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, అలా కామెంట్స్ పెట్టే వారికి ఇంట్లో ఆడపిల్లలు లేరా? అందుకే కామెంట్ బాక్స్ ని ఆఫ్ లో పెట్టాను అని తెలిపారు.ఇటువంటి చెత్త కామెంట్లు పెడుతున్నారు అసలు ఇలాంటి వాళ్లకు మనసు ఉందా? మాకే ఇలా ఉంటే ఆ కామెంట్ చదివిన వాళ్ళు మా గురించి ఇలా తప్పుగా అనుకుంటారు.

Telugu Amar Deep, Tejaswini Gowda-Latest News - Telugu

మా ఫ్యామిలీ ఏమనుకుంటారు నాకు అర్థం కావడం లేదు ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి అదేవిధంగా కామెంట్లు పడితే ఓకేనా కానీ మూల్యం చెల్లించుకుంటారు అంటూ ఎమోషనల్ అయింది తేజస్విని గౌడ.అయితే ఇప్పటివరకు మేము ఓపికతోనే ఉన్నాము ఎవరు ఏమనుకున్నా మా పెళ్లి వార్త విని చాలామంది సపోర్ట్ చేశారు కానీ కొంతమంది నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.పనికట్టుకుని మరి ఒక బ్యాచ్ కావాలని ఈ విధంగా మెసేజ్ లు పెడుతున్నారు.

మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉంటారు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది తేజస్విని.జానకి కలగనలేదు సీరియల్ లో చూడటానికి చాలా సాఫ్ట్ గా అమాయకంగా కనిపించే అమర్ ఈ విషయం పై సీరియస్ గా స్పందించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube