అనగనగా ఓ అమరావతి : కథ కంచికి అందరూ ఇంటికి

వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిస్తేజంలో మునిగిపోయింది.పార్టీ క్యాడర్ అంతా పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్న సమయంలో తెలుగుదేశం పని ఇక అయిపొయింది అని అంతా అనుకుంటున్న సమయంలో రాజధానుల అంశం తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసింది.

 Amaravati Movement Slow Down-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నుంచి రాజధానిని తరలించాలని కంకణం కట్టుకుంది.అయితే డైరెక్ట్ గా అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని ముందే గ్రహించిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది .విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ఇలా మూడు భాగాలుగా విభజించింది.

ప్రభుత్వ నిర్ణయం ఏమిటి అనేది ముందుగానే గ్రహించిన టీడీపీ అమరావతి లో రాజధాని కి భూములు ఇచ్చిన రైతులకు మద్దతుగా నిలబడాలని భావించింది.

ఈ విషయంపై రైతులకు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి ఉద్యమానికి తెర లేపింది.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అమరావతి ఉద్యమం నిరంతరంగా కొనసాగుతోంది.ఈ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్ రోల్ పోషించింది.రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అమరావతి కి మద్దతుగా టీడీపీ చేపట్టింది.

దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చేలా తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది.ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది అనుకుంటున్న సమయంలో కేంద్రం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు తెలపడం, రాజధాని అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అని ప్రకటించడంతో కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది.

Telugu Amaravati, Bjp, Pawan Kalyan, Visakhapatnam, Ys Jagan-Telugu Political Ne

అప్పటివరకు అమరావతి కి మద్దతుగా నిలబడిన ఏపీ బీజేపీ నాయకులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొత్తం పూర్తిగా ఈ ఉద్యమం నుంచి పక్కకు తప్పేసుకున్నారు.పవన్ కేంద్రము నిర్నయాయం తరువాత అమరావతిలో పర్యటించినా అక్కడి రైతులకు ప్రజలకు ఏ భరోసా ఇవ్వలేకపోయారు.కేంద్రం అండతో జగన్ రాజధానిగా విశాఖను తరలించేందుకు సిద్ధం అవుతున్నాడని ప్రచారంతో అమరావతి ఉద్యమం మెల్లిమెల్లిగా బలహీనమవుతుంది వస్తోంది.ప్రస్తుతం అమరావతి ఉద్యమం జరుగుతున్నాపెద్దగా ప్రభావం అయితే కనిపించడం లేదు.

మీడియా కూడా ఈ అంశాన్ని పెద్దగా హైలెట్ చేయడంలేదు.తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రస్తుతం కేసులు బయటికి వస్తున్నతరుణంలో అందరి ద్రుష్టి వాటిమీదే పడిపోయింది.

ఇప్పుడు అమరావతి ఉద్యమం ప్రభావం అంతంత మాత్రంగా ఉంది.ముందు ముందు అమరావతిని అందరూ మర్చిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube